Jobs : త్వరలోనే 50వేలకి పైగా ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

రానున్న రోజుల్లో ఫుల్‌గా ఉద్యోగ నియామకాలున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి అగ్రకంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లోనూ భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

  • Share this:
ఐటీ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేల మందిని నియమించుకున్నాయి.. ఇందులో టీసీఎస్ 29,287 మందిని నియమించుకోగా.. ఇన్ఫోసిస్ 24,016 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈ సంఖ్య టీసీఎస్‌లో 4,24,285 మంది, ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2, 28,123 మందిగా ఉంది. గతేడాదితో పోల్చితే ఇది చాలా ఎక్కువగా ఉంది. 201718 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సంస్థలు కేవలం 11 వేల మందిని మాత్రమే నియమించుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ కంపెనీలు భారీగానే ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులుండడం, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఉద్యోగులను నియమించనున్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా డిజిటల్ వ్యాపారంపై దృష్టి నివారించడంతో నియామకాలు పెరిగాయి. కాబట్టి.. ఉన్న టాలెంట్‌ని మరింత మెరుగుపరచుకుని సంబంధిత సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే చాలు.. ఏంచక్కా చక్కని అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

Indian Railways Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో కాంట్రాక్ట్ టీచర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
First published: