హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Higher Education: విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్‌.. 2017-22 మధ్య కాలంలో భారతీయులు ఎంత మంది వెళ్లారంటే..

Higher Education: విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్‌.. 2017-22 మధ్య కాలంలో భారతీయులు ఎంత మంది వెళ్లారంటే..

Higher Education: విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్‌.. 2017-22 మధ్య కాలంలో భారతీయులు ఎంత మంది వెళ్లారంటే..

Higher Education: విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్‌.. 2017-22 మధ్య కాలంలో భారతీయులు ఎంత మంది వెళ్లారంటే..

Higher Education: వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్ (Scholarships) అందిస్తుండడంతో విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విదేశాల్లో ఉన్నత చదువులు (Higher Education) చదవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్ (Scholarships) అందిస్తుండడంతో విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2017-2022 మధ్య కాలంలో 30 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. లోక్ సభలో జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల వివరాలను వెల్లడించారు.

* 2017లో 4.54 లక్షల విద్యార్థులు

2022 సంవత్సరంలో విదేశాలకు వెళ్లిన భారతీయుల్లో 7.50 లక్షల మంది ఎడ్యుకేషన్ కోసం వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. 2021 సంవత్సరంలో ఈ సంఖ్య 4.4 లక్షలుగా ఉంది. 2020లో 2.59 లక్షలు, 2019లో 5.86 లక్షలు, 2018లో 5.17 లక్షలు, 2017లో 4.54 లక్షల మంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినట్లు సర్కార్ తెలిపారు.

* డెస్టినేషన్ కంట్రీ వీసా టైప్ ఆధారంగా

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌, భారతీయుల రాకపోకల డేటాను నిర్వహిస్తుంది. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల కెటగిరీని గుర్తించడానికి ప్రత్యేకమైన ఇండెక్స్ ఏమీ లేదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల ఉద్దేశం, వారి తెలిపే వివరాలు, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో విద్యార్థులు పేర్కొన్న డెస్టినేషన్ కంట్రీ వీసా రకం ఆధారంగా వివరాలను మాన్యువల్‌గా గుర్తిస్తారు.

* విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లు

విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఖర్చు చేస్తున్న డబ్బు దేశంలోని ఎడ్యుకేషన్ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని, ఈ నిధులను ఆదా చేయడానికి ‘ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ హై స్టాండర్డ్’ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వానికి ఉందా అని ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ మరో ప్రశ్న అడిగారు.

ఇది కూడా చదవండి : After 12th Class: 12వ తరగతి పూర్తి చేశారా.. మీ లైఫ్ ని మార్చే 5 కోర్సులు ఇవే..

ఈ ప్రశ్నకు సర్కార్ స్పందిస్తూ ప్రస్తుతం దేశంలో అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని లోక్ సభలో సమాధానం ఇచ్చారు. అయితే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు భారతదేశంలో తమ క్యాంపస్‌ల ఏర్పాటును సులభతరం చేసేందుకు వీలుగా యూజీసీ నిబంధనలను రూపొందించిందని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మంత్రి సుభాస్ సర్కార్ తెలిపారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణ) నిబంధనలు- 2023 ప్రకారం.. భారత్‌లో విదేశీ ఉన్నత విద్యా సంస్థలు తమ క్యాంపస్‌ల ఏర్పాటు విషయంపై జనవరి 18, 2023 నాటికి అందరి అభిప్రాయాలు, సూచనలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. అయితే వాటాదారుల నుంచి స్వీకరించిన అభ్యర్థనల్లో, ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలను స్వీకరించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు యూజీసీ పొడిగించిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Abroad, Career and Courses, EDUCATION, JOBS, Study abroad