Army Jobs: 100 పోస్టులు... 2 లక్షలకు పైగా దరఖాస్తులు... ఆర్మీ ఉద్యోగాలకు అమ్మాయిల పోటీ

Indian Army Recruitment 2019 | 100 పోస్టులకు ఏకంగా 2 లక్షల మందికి పైగా అమ్మాయిలు పోటీపడటం విశేషం. వీరికి ఈ నెలాఖరులో బెల్గాంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ.

news18-telugu
Updated: July 4, 2019, 5:56 PM IST
Army Jobs: 100 పోస్టులు... 2 లక్షలకు పైగా దరఖాస్తులు... ఆర్మీ ఉద్యోగాలకు అమ్మాయిల పోటీ
Army Jobs: 100 పోస్టులు... 2 లక్షలకు పైగా దరఖాస్తులు... ఆర్మీ ఉద్యోగాలకు అమ్మాయిల పోటీ (ప్రతీకాత్మక చిత్రం, image: Getty)
news18-telugu
Updated: July 4, 2019, 5:56 PM IST
ఇండియన్ ఆర్మీలో సేవలు అందించడానికి పోటీపడుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. 100 పోస్టులు ఉన్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. 100 పోస్టులకు 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తాజాగా తేలింది. సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు అర్హత పదోతరగతి మాత్రమేనని నోటిఫికేషన్‌లో వెల్లడించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అది కూడా 17 నుంచి 21 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిల నుంచే దరఖాస్తుల్ని స్వీకరించింది రిక్రూట్‌మెంట్ బోర్డు. 100 పోస్టులకు ఏకంగా 2 లక్షల మందికి పైగా అమ్మాయిలు పోటీపడటం విశేషం. వీరికి ఈ నెలాఖరులో బెల్గాంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ.

ప్రస్తుతం భారత సైన్యంలో 15 లక్షలకు పైగా సైనికులున్నారు. ఆర్మీలో ఉద్యోగం అంటే పురుషులకు మాత్రమేనన్న భావన ఉండేది. కానీ... సైన్యంలో పనిచేసేందుకు అమ్మాయిలు సైతం సిద్ధంగా ఉన్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. 'మహిళా ప్రవోస్ట్ యూనిట్' ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది ఇండియన్ ఆర్మీ. ఇందులో ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ అధికారులు, 40 మంది సైనికులు ఉంటారు. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఈ ఏడాది 100 సోల్జర్ జెనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టే, ప్రతీ ఏటా 100 చొప్పున 17 ఏళ్ల పాటు 1,700 మహిళల్ని నియమించుకునే ఆలోచనలో ఉంది ఇండియన్ ఆర్మీ.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే
Loading...
Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...