హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Monster.com: జాబ్ పోర్టల్ మాన్‌స్టర్.కామ్‌ రీబ్రాండింగ్‌.. కొత్త పేరు ఇదే!

Monster.com: జాబ్ పోర్టల్ మాన్‌స్టర్.కామ్‌ రీబ్రాండింగ్‌.. కొత్త పేరు ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఎంప్లాయ్‌మెంట్‌ వెబ్‌సైట్‌ మాన్‌స్టర్‌.కామ్‌ (Monster.com). ఇప్పుడు దాని పేరును ఫౌండ్‌ఇట్‌గా మార్చుకుని రీబ్రాండ్‌ చేసుకున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఎంప్లాయ్‌మెంట్‌ వెబ్‌సైట్‌ మాన్‌స్టర్‌.కామ్‌ (Monster.com). ఇప్పుడు దాని పేరును ఫౌండ్‌ఇట్‌గా మార్చుకుని రీబ్రాండ్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు మాన్‌స్టర్‌.కామ్‌ వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేస్తే ఫౌండ్‌ఇట్‌ పేరుతో అది దర్శనమిస్తోంది. భారత్‌తో పాటు సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, మిడిల్‌ ఈస్ట్‌లో ఈ పేరు మార్పు కనిపిస్తుంది. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో ఏడు కోట్ల మందికి పైగా జాబ్‌ సీకర్లు రిజిస్టర్‌ అయి ఉన్నారు. మొత్తం 18 దేశాలలో 10 వేల మంది కార్పొరేట్ కస్టమర్‌లను కలిగి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (AI), డేటా ఎనలటిక్స్‌లను ఉపయోగించుకుని ఉద్యోగార్థులకు ఉద్యోగాలను సజెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ విషయంపై ఫౌండిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేఖర్ గరిస్సా మాట్లాడారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈ ఫ్లాట్‌ఫామ్‌లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తతు డైనమిక్‌ జాబ్‌ మార్కెట్‌లో నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను హైర్‌ చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఊరికే ఉద్యోగాలను చూపడమే తమ పని కాదని, అంతకు మించిన సర్వీసులను ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పారు.

ప్రపంచ దేశాల్లో సేవలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో Monster.com సేవలు ఉన్నాయి. వాటిలో సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, మిడిల్‌ ఈస్ట్‌ల బిజినెస్‌ అంతటినీ క్విస్‌ కార్ప్‌(Quess Corp) చూసుకుంటోంది. ఇక్కడి సర్వీస్‌లను క్విస్ కార్ప్‌ తీసుకున్నప్పటి నుంచి ఈ దేశాల పరిధిలోని మాన్‌స్టర్‌.కామ్‌ పేరును రీబ్రాండింగ్‌ చేయాలని భావించింది. అయితే కోవిడ్‌ సహా కొన్ని కారణాల వల్ల ఆ పని జరగలేదు. ఎట్టకేలకు ఇప్పటికి సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్-ఈస్ట్ ప్రాంతాల్లో మాత్రం దీని పేరు ఫౌండిట్‌గా (Foundit)గా మారింది.

మానవ తెలివితేటలు, టెక్నాలజీ కలయికతో తమ ప్లాట్‌ఫాం పని చేసేలా మార్పులు చేశామన్నారు క్వెస్ కార్ప్ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అజిత్ ఐజాక్. జాబ్‌సీకర్లు, రిక్రూటర్లు తేలికగా తమకు కావాల్సిన వాటిని గుర్తించగలిగేలా సేవల్ని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.

శేఖర్ గరిస్సా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడు తమ రివేంప్డ్‌ ప్లాట్‌ఫాం లింక్డిన్‌ తరహాలో మరింత కొత్తగా పని చేస్తుందన్నారు. డేటాబేస్‌ని వర్గీకరించి వినియోగదారులకు బెటర్ గా సజెషన్స్‌ ఇవ్వగలుగుతుందని చెప్పారు. అభ్యర్థులు, రిక్రూటర్లకు AI-ఆధారిత సిఫార్సులు చేస్తుందని తెలిపారు. మాక్ ఇంటర్వ్యూలు, ప్రిపరేషన్ మెటీరియళ్లలాంటి పర్సానలైజ్డ్‌ సేవలనూ ఇస్తుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా ఇటువంటి మార్పులు ఒకదాని వెంట ఒకటి అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని తెలిపారు. ఆ తర్వాత ఇతర ఫీచర్లు, సేవలను పరిశీలిస్తామని వివరించారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: JOBS, Private Jobs

ఉత్తమ కథలు