Scholarship: చదువుకోవడానికి డబ్బులు కావాలా? మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ 5 స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయండి

Modi Government scholarship schemes | బాగా చదువుకునే టాలెంట్ మీకు ఉందా? ఆర్థిక సమస్యలు మీ చదువుకు అడ్డంకిగా మారాయా? అనేక స్కాలర్‌షిప్ స్కీమ్స్ మీకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి.

news18-telugu
Updated: October 22, 2020, 11:44 AM IST
Scholarship: చదువుకోవడానికి డబ్బులు కావాలా? మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ 5 స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయండి
Scholarship: చదువుకోవడానికి డబ్బులు కావాలా? మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ 5 స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రైవేట్ సంస్థలు ఇచ్చే స్కాలర్‌షిప్స్‌తో పాటు ప్రభుత్వం నుంచి చాలావరకు స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఉంటాయి. అయితే వాటి సమాచారం విద్యార్థుల వరకు చేరకపోవడంతో లబ్ధిపొందలేకపోతున్నారు. కేంద్ర విద్యా శాఖ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. స్కూల్‌లో చదువుకునే విద్యార్థుల నుంచి కాలేజీలో విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్ వరకు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారికి ఏటా రూ.10,000 నుంచి రూ.80,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. మరి ఆ స్కీమ్స్ ఏవో, వాటికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

1. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పేరుతో ఓ స్కీమ్ ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఈ స్కీమ్ రూపొందించారు. 12వ తరగతి పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్థులు 80వ పర్సెంటైల్ కన్నా ఎక్కువ మార్క్స్‌తో పాస్ కావాలి. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 82,000 స్కాలర్‌షిప్స్ అందిస్తున్నారు. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్నవారెవరైనా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అప్లై చేయొచ్చు. ఎంపికైనవారికి ఏడాదికి రూ.10,000 నుంచి రూ.20,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య దరఖాస్తు చేయాలి.

BSF Recruitment 2020: బీఎస్ఎఫ్‌లో 228 పోలీస్ ఉద్యోగాలు... చివరి తేదీ ఎప్పుడంటే

Jobs: మొత్తం 550 ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

2. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇస్తారు. 8వ తరగతి పాసైన విద్యార్థులు ఆ తర్వాత విద్యాభ్యాసం కోసం ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు. ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. 8వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి. వార్షికాదాయం రూ.1.50 లోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అప్లై చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా 1,00,000 స్కాలర్‌షిప్స్ ఇస్తారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అప్లై చేయాలి.

3. ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా చదువుతున్న అమ్మాయిలు స్కాలర్‌షిప్ పొందొచ్చు. 10+2 లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000 లోపు ఉన్నవారు దరఖాస్తు చేయాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఏడాదికి రూ.50,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. టెక్నికల్ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరిన అమ్మాయిలు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అప్లై చేయాలి.

Sonu Sood Scholarship: కలెక్టర్ కావాలనుకుంటున్నారా? స్కాలర్‌షిప్స్ ఇస్తున్న సోనూ సూద్

DRDO Scholarship: అమ్మాయిలకు ప్రతీ ఏడాది రూ.1,86,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు మరో నెల రోజుల గడువు

4. దివ్యాంగులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం పొందాలంటే ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అప్లై చేయొచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్నవారికే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000 లోపు ఉన్నవారు అప్లై చేయాలి. ఏటా రూ.50,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దరఖాస్తు చేయాలి.

5. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్-PMRF నెలకు రూ.80,000 స్టైపెండ్ లభిస్తుంది. బీటెక్ గ్రాడ్యుయేట్, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిలు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ విద్యార్థులు ఏడాదిలో ఎప్పుడైనా ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: October 22, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading