• Home
 • »
 • News
 • »
 • jobs
 • »
 • MODI GOVERNMENT IS SETTING UP LAND BANK PORTAL TO WOO INVESTORS AND CREATE EMPLOYMENT IN VARIOUS SECTORS SS

Jobs: ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం మోదీ ప్రభుత్వం పెద్ద ప్లాన్

Jobs: ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం మోదీ ప్రభుత్వం పెద్ద ప్లాన్ (File Photo: ప్రధాని నరేంద్ర మోదీ)

భారతదేశంలో ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • Share this:
  కరోనా వైరస్ సంక్షోభం జాబ్ మార్కెట్‌లో సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. జాబ్ మార్కెట్ మాత్రమే కాదు... ఈ మహమ్మరి ప్రభావం అన్ని రంగాలపైనా ఉంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ప్రకటించింది. భారతదేశంలో ఉత్పత్తి మార్గాలు పెంచడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించడం, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వాల్డ్ లాంటి నినాదాలను సాకారం చేయడమే ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ లక్ష్యం. ఈ ప్రోగ్రామ్ ద్వారా లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది. కొత్త ప్రాజెక్టుల్ని నిర్వహించనుంది. అంతేకాదు... ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తోంది. ఏకంగా ఐదు లక్షల హెక్టార్ల భూమిని సిద్ధం చేస్తోంది. హాంకాంగ్ దేశంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 3390 ఇండస్ట్రియల్ బెల్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్లలో ఉన్న ఈ భూమితో నేషనల్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

  Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

  UPSC Jobs: రైల్వేతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 559 జాబ్స్... రేపే చివరి తేదీ

  Modi Government Land Bank, Land Bank portal, govt jobs, latest govt jobs notifications, latest govt jobs in railway, govt jobs today, govt jobs 2020, central government jobs for graduates, 10th pass govt job, central govt jobs, మోదీ ప్రభుత్వం, ల్యాండ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు
  ప్రతీకాత్మక చిత్రం


  ఏ ఫ్యాక్టరీ నిర్మించాలన్నా, ప్రాజెక్ట్ చేపట్టాలన్నా ముందుగా భూమి కావాలి. ఫ్యాక్టరీ ప్రణాళికలు రూపొందించిన తర్వాత భూమిని సేకరించడం అంటే అదో పెద్ద ప్రాసెస్. చాలా సమయం తీసుకుంటుంది. అనేక వివాదాలు కూడా తెరపైకి వస్తుంటాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ సెజ్, సింగూరులో టాటా మోటార్స్ ప్లాంట్, ఒడిషాలోని నియంగిరిలో వేదాంత బాక్సైట్ మైనింగ్ లాంటి ప్రాజెక్టులకు భూ సేకరణ పెద్ద వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి రాకుండా ముందుగానే ప్రభుత్వం దగ్గర భూమి సిద్ధంగా ఉంటే... కొత్త ఫ్యాక్టరీలు తెరిచేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వం దగ్గర భూమి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్లకు ఇవ్వడానికి పెద్దగా అడ్డంకులు ఏమీ ఉండవు. దీని వల్ల ఫ్యాక్టరీల ఏర్పాటు త్వరగా జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనా విషయంలో యాంటీ సెంటిమెంట్ ఉంది. అక్కడ్నుంచి కంపెనీలు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అలాంటి కంపెనీలను భారతదేశం ఆకర్షించే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... ల్యాండ్ బ్యాంక్ ద్వారా దేశీయంగా కూడా కొత్త ఫ్యాక్టరీలు నెలకొల్పే ప్రక్రియ వేగవంతమవుతుంది.

  DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

  Jobs: టెన్త్ పాసైతే చాలు... కేంద్ర ప్రభుత్వ సంస్థలో 164 ఉద్యోగాలు

  Modi Government Land Bank, Land Bank portal, govt jobs, latest govt jobs notifications, latest govt jobs in railway, govt jobs today, govt jobs 2020, central government jobs for graduates, 10th pass govt job, central govt jobs, మోదీ ప్రభుత్వం, ల్యాండ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు
  ప్రతీకాత్మక చిత్రం


  ఐదు లక్షల హెక్టార్లకు సంబంధించిన వివరాలన్నీ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌లో ఉంటాయి. 21 రాష్ట్రాల్లో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో ల్యాండ్ బ్యాంక్స్ వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. మరిన్ని రాష్ట్రాలకు చెందిన భూముల వివరాలు కూడా త్వరలో అప్‌లోడ్ కానున్నాయి. వెబ్‌సైట్ మాత్రమే కాదు మొబైల్ అప్లికేషన్ కూడా రానుంది. వాటి ద్వారా ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉన్నాయో పూర్తి వివరాలను ఇన్వెస్టర్లు చూడొచ్చు. లాజిస్టిక్స్, ల్యాండ్, ఎయిర్, రైల్ కనెక్టివిటీ లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. తమకు కావాల్సిన చోట ప్రభుత్వాన్ని భూమి కోరొచ్చు. ప్రభుత్వం ఐదు లక్షల హెక్టార్లలో ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయడం ద్వారా కొత్త విదేశీ కంపెనీలు భారతదేశానికి రానున్నాయి. దేశీయంగా కొత్త ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. వీటికి అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

  భారతదేశం 20 పారిశ్రామిక రంగాలపైన ప్రధానంగా దృష్టిపెడుతోంది. అందులో ఎయిర్ కండీషనర్, లెదర్, ఫుట్‌వేర్, ఆగ్రో-కెమికల్స్, రెడీ టు ఈట్ ఫుడ్, స్టీల్, అల్యూమినియం, కాపర్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆటో కంపోనెంట్స్, టీవీ సెట్ టాప్ బాక్సు, సీసీటీవీ, స్పోర్ట్స్ గూడ్స్, ఇథనాల్ మ్యాన్యుఫ్యాక్చర్, బయో ఫ్యూయెల్స్, టాయ్స్, ఫర్నీచర్ లాంటి రంగాలున్నాయి. వీటితో పాటు ఇటీవల పాపులర్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ లాంటి రంగాలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ఈ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం ద్వారా వీటిలో నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ ఉంటుంది. వీటితో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
  Published by:Santhosh Kumar S
  First published: