నిరుద్యోగులకు ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్ తో పాటు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హత వివరాలు:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విభాగంలో 5, అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో 2, డిప్యూటీ ఇంజనీర్ విభాగంలో 2, జూనియర్ సూపర్ వైజర్ విభాగంలో 1, జూనియర్ ఇంజనీర్ విభాగంలో 16, అసిస్టెంట్(ఐటీ) విభాగంలో 1 పోస్టు ఉంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.70,000-2,00,000 వరకు వేతనం ఉంటుంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వేతనం చెల్లించనున్నారు.
Railway Jobs 2022: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(Operations): మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఉంటుంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (Rolling Stock): మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
అసిస్టెంట్ మేనేజర్(Operations): మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్ విభాగంలో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
అభ్యర్థులు ఇతర ఖాళీలు, విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా అప్లై చేయాలంటే..
1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://www.mmrcl.com/ ఓపెన్ చేయాలి.
2. అనంతరం Careers ఆప్షన్ ను ఎంచుకోవాలి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో MMRCL/HR-Rect./ 2022-01 పక్కన్ Apply Online ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
4. అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Metro Train