Home /News /jobs /

MBA Entrance Exams: CAT-2021 రాయలేకపోయారా? అయితే, ఈ ఎగ్జామ్స్ ద్వారా బిజినెస్ స్కూల్స్ లో చేరండి

MBA Entrance Exams: CAT-2021 రాయలేకపోయారా? అయితే, ఈ ఎగ్జామ్స్ ద్వారా బిజినెస్ స్కూల్స్ లో చేరండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాట్ పరీక్షను మిస్ చేసుకున్నవారు దిగులు పడాల్సిన పనిలేదు. కొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ కోర్సు కోసం ప్రత్యేకంగా అడ్మిషన్లు ఓపెన్ చేశాయి. ఇందుకోసం SNAP, IBSAT, MICAT, MAT, XAT లాంటి ఎంబీఏ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షలు క్లియర్ చేయడం ద్వారా అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 

ఇంకా చదవండి ...
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(MBA)లో ప్రవేశానికి కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CAT) చాలా ముఖ్యమైంది. మంచి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసేందుకు ఈ పరీక్షను తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. నవంబర్ 28న క్యాట్ 2021 ఎగ్జామ్ జరిగింది. త్వరలో ఆన్సర్ 'కీ' కూడా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 159 నగరాల్లో దాదాపు 2.3 లక్షల మంది క్యాట్- 2021 పరీక్షకు హాజరయ్యారు. అయితే క్యాట్ పరీక్షను మిస్ చేసుకున్నవారు దిగులు పడాల్సిన పనిలేదు. కొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ కోర్సు కోసం ప్రత్యేకంగా అడ్మిషన్లు ఓపెన్ చేశాయి. ఇందుకోసం SNAP, IBSAT, MICAT, MAT, XAT లాంటి ఎంబీఏ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షలు క్లియర్ చేయడం ద్వారా అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

XAT..
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గా(XAT) పిలిచే ఈ పరీక్షను XLRI జెంషెడ్ పుర్, XIMB భువనేశ్వర్‌తో పాటు పలు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ ఎగ్జామ్ ద్వారా తమ సంస్థల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ నవంబర్ 30న పూర్తవుతుంది. ఈ పరీక్షను 2022 జనవరి 2న నిర్వహిస్తారు.
Open Book Exam: బుక్ చూసి ప‌రీక్ష‌లు రాయ‌డం ఈజీ కాదు.. ఓపెన్ బుక్ ఎగ్జామ్స్‌ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన ఢిల్లీ యూనివ‌ర్సిటీ

IBSAT..
ఈ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ICFAI ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తోంది. ఇందులో అర్హత పొందినవారు. ఐబీఎస్ అహ్మదబాద్, ఐబీఎస్ బెంగళూరు, ఐబీఎస్ గుడ్‌గావ్, ఐబీఎస్ డెహ్రాడూన్, ఐబీఎస్ జయపూర్, ఐబీఎస్ ముంబయి, ఐబీఎస్ పూణె తదితర బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ ఎగ్జామ్‌కు డిసెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 25, 26 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Jobs in TCS: డిగ్రీ పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

MICAT..
ఎంఐసీఏటీ ప్రవేశ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. రెండో సెషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 16 లోపు పూర్తి చేయాలి. 2022 జనవరి 25 నుంచి అడ్మిట్ కార్డులు జారీ అవుతాయి. జనవరి 29న పరీక్ష నిర్వహిస్తారు. తుది ఫలితాలను ఫిబ్రవరి 18న విడుదల చేస్తారు.
CAT 2021 : "క్యాట్‌" క్వాలిఫై అవ్వ‌లేక‌పోతున్నారా..? అయితే ఐఐఎంలో సీట్ పొందేందుకు ఇత‌ర మార్గాలు ఇవే!

KIIT..
భువనేశ్వర్ లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం KIIT ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ 2022 జనవరి 15 నుంచి 17 మధ్య ఉండనుంది. ఆసక్తిగల విద్యార్థులు జనవరి 10 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

 IRMASAT..
ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనెజ్మెంట్, ఆనంద్(IRMA) జాతీయ స్థాయిలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేనెజ్మెంట్ సెషన్ కోసం ఏడాదికి ఓ సారి ఈ పరీక్ష నిర్వహిస్తుంది. 2022 సంవత్సరం కోసం డిసెంబర్ 30లోపు ఆన్ లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18, 19 నిర్వహిస్తారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Business, Career and Courses, EDUCATION, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు