MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో జాబ్స్... మార్చి 18 చివరి తేదీ

MIDHANI Recruitment 2020 | హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. కాంచన్‌బాగ్‌లోని మిధాని ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 16, 2020, 10:01 AM IST
MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో జాబ్స్... మార్చి 18 చివరి తేదీ
MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో జాబ్స్... మార్చి 18 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 104 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది మిధాని. దీంతో పాటు 18 ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 4న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 18 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://midhani-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి careers సెక్షన్‌లో e-recruitment క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

MIDHANI Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 18
జూనియర్ మేనేజర్ (సివిల్)- 2
జూనియర్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)- 2
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ-సిస్టమ్స్ అడ్మిన్)- 1
జూనియర్ ఆర్టిసన్ (ఫిట్టర్)- 6జూనియర్ ఆర్టిసన్ (ఎలక్ట్రికల్)- 3
ఎన్‌డీటీ ఆపరేటర్- 4

MIDHANI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 18 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
విద్యార్హత- సంబంధిత విభాగంలో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమాతో పాటు అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో జాబ్స్... 1,000 పైగా పోస్టుల భర్తీ

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
Published by: Santhosh Kumar S
First published: March 16, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading