MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 104 ఉద్యోగాలు... మార్చి 19 నుంచి ఇంటర్వ్యూలు

MIDHANI Recruitment 2020 | హైదరాబాద్‌లోని మిధానిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 104 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది మిధాని. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 17, 2020, 8:39 AM IST
MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 104 ఉద్యోగాలు... మార్చి 19 నుంచి ఇంటర్వ్యూలు
MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 104 ఉద్యోగాలు... మార్చి 19 నుంచి ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 104 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2020 మార్చి 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని మిధాని కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగానే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో, ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు http://www.apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన తేదీన నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

MIDHANI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే



మొత్తం ఖాళీలు- 104

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
మెటల్లర్జీ- 4
ఎలక్ట్రికల్- 4
మెకానికల్- 4ఇన్‌స్ట్రుమెంటేషన్- 1
సివిల్- 1

డిప్లొమా అప్రెంటీస్
మెటల్లర్జీ- 2/3
ఎలక్ట్రికల్- 3
మెకానికల్- 3
ఇన్‌స్ట్రుమెంటేషన్- 1
సివిల్- 1

ట్రేడ్ అప్రెంటీస్
వెల్డర్- 25
ఫిట్టర్- 10
టర్నర్- 10
ఎలక్ట్రీషియన్- 25
మెషినిస్ట్- 10

MIDHANI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
ఇంటర్వ్యూ తేదీ- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు 2020 మార్చి 19న, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు 2020 మార్చి 20న, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 2020 మార్చి 21న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
Auditorium,
Corporate Hostel Building,
MIDHANI, Hyderabad.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
Published by: Santhosh Kumar S
First published: March 17, 2020, 8:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading