Home /News /jobs /

MINISTRY OF TEXTILE RECRUITMENT 2022 FOR TEXTILE HAS INVITED APPLICATIONS FOR JUNIOR ASSISTANT ATTENDER AND OTHER POSTS VB

Textile Recruitment 2022: 10వ తరగతి అర్హతతో.. టెక్స్‌టైల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీ..

Textile Recruitment 2022: 10వ తరగతి అర్హతతో.. టెక్స్‌టైల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీ..

Textile Recruitment 2022: 10వ తరగతి అర్హతతో.. టెక్స్‌టైల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీ..

Textile Recruitment 2022: టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వీటిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ texmin.nic.inని సందర్శించి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి

ఇంకా చదవండి ...
టెక్స్‌టైల్స్(Textile) మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వీటిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ texmin.nic.inని సందర్శించి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.  ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ వీవర్, సీనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్ (వీవింగ్), జూనియర్ అసిస్టెంట్ (ప్రాసెసింగ్), అటెండెంట్ (వీవింగ్) మరియు అటెండెంట్ (ప్రాసెసింగ్) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ(Delhi), పానిపట్, కులు, మీరట్, చమోలి, శ్రీనగర్, జైపూర్, జమ్మూ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ జోధ్‌పూర్ , వారణాసి వంటి వీవర్స్ సర్వీస్ సెంటర్‌లలో లేదా నార్త్ జోన్‌లోని ఏదైనా ఇతర కార్యాలయాలలో పని చేయాల్సి ఉంటుంది.

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ.2లక్షలు లాభం..


దరఖాస్తుకు చివరి తేదీ: ఈ నోటిఫికేషన్ జూలై 9న విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి 45 రోజుల వరకు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 23గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : ' డైరెక్టర్, వీవర్స్ సర్వీస్ సెంటర్, B-2 వీవర్స్ కాలనీ, భరత్ నగర్, ఢిల్లీ- 110 052'.

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-6 కింద రూ. 35,400 నుండి రూ. 1,12, 400 మధ్య జీతం ఇవ్వబడుతుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 29

టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఖాళీల వివరాలు ఇవే..































పోస్టుపేరు     ఖాళీల సంఖ్య                       
జూనియర్ వీవర్07
సీనియర్ ప్రింటర్02
జూనియర్ అసిస్టెంట్ (నేత)02
జూనియర్ అసిస్టెంట్ (ప్రాసెసింగ్)02
అటెండెంట్ (నేత)13
అటెండెంట్ (ప్రాసెసింగ్)03

విద్యార్హత
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే ప్రముఖ సంస్థలో వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ , డిజైన్ల మగ్గాలను ఏర్పాటు చేయడం, నేయడంలో 8 సంవత్సరాల అనుభవం ఉండాల. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి హ్యాండ్లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా లేదా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా / హ్యాండ్లూమ్ వీవింగ్‌లో రెండేళ్లు సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Central jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు