హోమ్ /వార్తలు /jobs /

Scholarship: విదేశాల్లో చదువుకుంటారా? స్కాలర్‌షిప్‌కు అప్లై చేయండి ఇలా

Scholarship: విదేశాల్లో చదువుకుంటారా? స్కాలర్‌షిప్‌కు అప్లై చేయండి ఇలా

National Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ (Scholarship) అందిస్తోంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

National Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ (Scholarship) అందిస్తోంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

National Overseas Scholarship | విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ (Scholarship) అందిస్తోంది. విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (NOS) ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ (Scholarship) అందజేస్తోంది. మొత్తం 125 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభించనుంది. ఆసక్తి గల విద్యార్థులు 2022 మార్చి 31 లోగా దరఖాస్తు చేయాలి. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లాంటి కోర్సులు చదవాలనుకునేవారు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయొచ్చు. తక్కువ ఆదాయం ఉన్న షెడ్యూల్డ్ కులాలు, డీనోటిఫై చేసిన సంచార, పాక్షిక సంచార జాతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. మరి ఈ స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    National Overseas Scholarship: నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వివరాలివే...

    మొత్తం స్కాలర్‌షిప్స్125
    షెడ్యూల్డ్ కులాలు115
    డీనోటిఫై చేసిన సంచార, పాక్షిక సంచార జాతులు06
    భూమిలేని వ్యవసాయ కూలీలు, సాంప్రదాయ కళాకారులు04

    Invitation of online applications for National Overseas Scholarship for the Year 2022-23. The portal will remain open from 15-2-2022 to 31-3-2022.

    Jobs in Microsoft: హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్... అప్లై చేయండి ఇలా

    National Overseas Scholarship: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

    దరఖాస్తు ప్రారంభం- 2022 ఫిబ్రవరి 15

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 31

    విద్యార్హతలు- పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయాలి.

    వయస్సు- 2022 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్ల లోపు

    కుటుంబ వార్షికాదాయం- రూ.8,00,000 లోపు

    ఈ స్కాలర్‌షిప్ గైడ్‌లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    LIC Recruitment 2022: టెన్త్ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

    National Overseas Scholarship: అప్లై చేయండి ఇలా

    Step 1- అభ్యర్థులు ముందుగా http://www.nosmsje.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.

    Step 3- విద్యార్థులు పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి.

    Step 5- విద్యార్హతలు, చేయాలనుకుంటున్న కోర్సు గురించి వివరించాలి.

    Step 6- వీసా వివరాలను కూడా ఎంటర్ చేయాలి.

    Step 7- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 8- వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

    First published:

    ఉత్తమ కథలు