కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు (Ministry of Railways) చెందిన మౌలిక సదుపాయాల ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ (Apprentice Jobs) పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 19, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 13 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 32 |
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ | 19 |
సివిల్ ఇంజనీరింగ్ | 12 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 4 |
ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్ | 3 |
టెక్నీషియన్ అప్రెంటీస్ | 13 |
సివిల్ ఇంజనీరింగ్ | 8 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 3 |
ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్ | 2 |
AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 174 ఉద్యోగాలు... రూ.49,870 వేతనం
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13
విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి.
ఇతర నియమనిబంధనలు- కోర్సు పూర్తి చేసి శిక్షణ తీసుకున్నవారు, ఏడాదికి పైగా అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు.
వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.8,500
శిక్షణా కాలం- ఒక ఏడాది.
IRCTC Recruitment 2021: ఐఆర్సీటీసీలో 150 ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు
Step 1- అభ్యర్థులు https://www.ircon.org/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో HR & Career సెక్షన్ క్లిక్ చేయాలి.
Step 3- అందులో Career @ IRCON పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Engagement of Apprentices under Apprentices Act, 1961 లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 5- Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 6- వేర్వేరు పేజీలకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి.
Step 7- అప్లై చేయాలనుకున్న పోస్టు పక్కన ఉన్న Apply Online లింక్ క్లిక్ చేయాలి.
Step 8- అభ్యర్థి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 9- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS