హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Ministry of Labour Department: కేంద్రం కొత్త రూల్స్.. ఆఫీసుకు పెగ్గేసి వచ్చినా, కునుకు తీసినా..

Ministry of Labour Department: కేంద్రం కొత్త రూల్స్.. ఆఫీసుకు పెగ్గేసి వచ్చినా, కునుకు తీసినా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ తమ విధుల్లో పాటించాల్సిన నిబంధనల్లో కేంద్రం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మిక శాఖ కొన్ని నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ని శనివారం జారీ చేసింది.

ఇంకా చదవండి ...

ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతుంటారన్న టాపిక్ పై వచ్చిన జోకులకు లెక్కలేదు. సినిమాల్లో కూడా వీటిని వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ నేను ప్రభుత్వ ఉద్యోగిని అని ఎవరైనా అంటే ’ఆఫీసుకు వెళ్లి నిద్రపోవడమే కదా, మీకేం పని ఉంటుంది. మీరు అనుకున్నప్పుడే పని పూర్తవుతుంది. మీ చేతిలోకి డబ్బు రాకుంటే పనవ్వదు..‘ అంటూ ఎలా ఎన్నెన్నో మాటలు అంటుంటారు. అలాగే కొన్ని రకాల ప్రైవేటు ఉద్యోగులు కూడా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని విధుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. తమ ప్రవర్తనా తీరుతో యాజమాన్యాలకు తలనొప్పి తెస్తుంటారు. వీటికి చెక్ పెట్టాలని కేంద్రం భావించిందేమో, కొన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనల్లో పెను మార్పులనే తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మిక శాఖ కొన్ని నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ని శనివారం జారీ చేసింది. తయారీ, మైనింగ్, సర్వీస్ రంగాల్లోని ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలపై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

కొత్తగా కేంద్ర కార్మిక శాఖ తీసుకురాబోతున్న చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగి ఆఫీసులో నిద్రపోతే అది భాద్యతారాహిత్యం కిందకే వస్తుంది. దుష్ప్రవర్తన కారణంతో అతడిపై పై స్థాయి ఉద్యోగి/బాస్ చర్యలు తీసుకొచ్చు. పలుమార్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే అతడిని ఉద్యోగంలోంచి తొలగించవచ్చు కూడా. అలాగే ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకపోతే విచారణకు ఆదేశించవచ్చు. విచారణలో ఉండగా కూడా కూడా అతడిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఉంటుంది. తనకు సంబంధంలేని విధుల్లో జోక్యం చేసుకున్నా కూడా అది దుష్ప్రవర్తన కిందకే వస్తుందని ఈ నిబంధనల్లో ఉంది.

లంచాలు తీసుకోవడం, ఆఫీసులో దొంగతనానికి పాల్పడటం, దొంగతనాన్ని ప్రోత్సహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం, రోజూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం, ఏ అనారోగ్యం లేకున్నా కూడా అబద్ధం చెప్పి విధులకు రాకపోవడం, అకారణంతో పనిని వాయిదా వేస్తూ పోవడం వంటివి బాధ్యతారాహిత్యం కిందకే వస్తాయి. ఫుల్లుగా మందు కొట్టి ఆఫీసుకు రావడం, బాస్ తో తగాదా పెట్టుకోవడం, సహోద్యోగులను కించ పరుస్తూ మాట్లాడటం, విధుల్లో అలసత్వం వహించడం, తన కింద స్థాయి ఉద్యోగుల నుంచి బహుమతులు తీసుకోవడం, బాస్ కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పది రోజులకు మించి ఆఫీసుకు రాకపోవడం వంటివి కూడా కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన నిబంధనల్లో ఉన్నాయి. ఉద్యోగంలో చేరేటప్పుడు వ్యక్తిగత వివరాలను, అనుభవం గురించి తప్పుగా చెప్పడం, ప్రయాణాలు చేయకున్నా చేసినట్టు చూపించి ట్రావెల్ అలవెన్సులు పొందడం కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుంది. వీటిల్లో ఏ ఒక్క దాన్ని ఉల్లంఘించినా అతడిపై చర్యలు తీసుకోవచ్చునని కేంద్రం కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది. ఇలా ఈ తరహా రూల్స్ ను కార్మిక శాఖ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

First published:

Tags: Central Government, Central govt employees, IT Employees, National

ఉత్తమ కథలు