భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఉద్యోగ ప్రకటన విడుదలైన 21 రోజుల్లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. కమాండర్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీఓ.
AP Jobs: ఏపీలోని ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
1. ట్రేడ్స్ మెన్ మేట్ (Tradesmen Mate): విభాగంలో 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
2. జేఓఏ (JOA): ఈ విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నెలకు రూ. 19,900 నుంచి 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
3. మెటీరియల్ అసిస్టెంట్ (Material Assistant): ఈ విభాగంలో 19 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
4. ఎంటీఎస్(MTS): ఈ విభాగంలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
5. ఫైర్ మెన్ (Fireman): ఈ విభాగంలో 64 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
6. ఏబీఓయూ ట్రేడ్స్ మెన్ మేట్ (ABOU Tradesman Mate): ఈ విభాగంలో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ.56,900 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, Government jobs, Indian Navy, JOBS