MINISTRY OF DEFENCE INVITES APPLICATIONS FOR 400 POSTS APPLY BEFORE 2021 SEPTEMBER 17 SS
Ministry of Defence Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? కేంద్ర రక్షణ శాఖలో 400 ఉద్యోగాలకు రెండు రోజుల్లో అప్లై చేయండి
Ministry of Defence Recruitment 2021: టెన్త్ పాస్ అయ్యారా? కేంద్ర రక్షణ శాఖలో 400 ఉద్యోగాలకు రెండు రోజుల్లో అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Ministry of Defence Recruitment 2021 | టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) లో 400 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర రక్షణ శాఖ (Ministry of Defence) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. బెంగళూరులోని ఏఎస్సీ సెంటర్ సౌత్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది కేంద్ర రక్షణ శాఖ. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 17 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్లోనే ఉంటుంది.
Ministry of Defence Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...
సివిల్ మోటార్ డ్రైవర్- టెన్త్ క్లాస్ పాస్ కావాలి. హెవీ, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. పురుషులు మాత్రమే అప్లై చేయాలి.
క్లీనర్- టెన్త్ పాస్ కావాలి.
కుక్- టెన్త్ పాస్ కావాలి. కుకింగ్‌లో అనుభవం ఉండాలి.
సివిలియన్ కేటరింగ్ ఇన్స్ట్రక్టర్- టెన్త్ పాస్ కావాలి. కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావాలి. కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
లేబర్- టెన్త్ పాస్ కావాలి. పురుషులు మాత్రమే అప్లై చేయాలి.
Ministry of Defence Recruitment 2021: దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్లో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్స్ పంపాలి.
లేబర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Presiding Officer,
Civilian Direct Recruitment Board,
CHQ, ASC Centre (North) - 1 ATC,
Agram Post, Bangalore -07
ఇతర పోస్టులకు దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Presiding Officer,
Civilian Direct Recruitment Board,
CHQ, ASC Centre (South) - 2 ATC,
Agram Post,
Bangalore -07.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.