Home /News /jobs /

MINISTER SATHYAVATHI RATHOD SAYS PROMOTIONS TO ANGANWADIS SOON NS

Telangana: ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతనాల పెంపు.. కీలక ప్రకటన చేసిన మంత్రి.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఉద్యోగుల వేతనాల పెంపు, పదోన్నతులు, నూతన ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన చేశారు.

    తెలంగాణలో ఉద్యోగుల వేతనాల పెంపు, పదోన్నతులు, నూతన ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన చేశారు. అంగన్‌వాడీలకు త్వరలో పదోన్నతులు ఇవ్వబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. కష్టకాలంలో, ఇబ్బందులలో కూడా పని చేస్తున్న అంగన్‌వాడీ సేవలకు గుర్తింపుగా భీమా కల్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కమిషనర్ దివ్య హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ చీరలకు వెల కట్టి చూడకుండా, వాటిని కానుకగా భావించాలన్నారు. త్వరలో చేనేత చీరలు ఇవ్వబోతున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో అంగన్‌వాడీలను వర్కర్లు అంటే సీఎం కేసీఆర్ ఇప్పుడు టీచర్లుగా పిలవాలని చెప్పి మంచి గౌరవం కల్పించారని మంత్రి గుర్తు చేశారు. ఎక్కువసార్లు వేతనాలు కూడా పెంచారన్నారు.

    ఈసారి కూడా మరోసారి అంగన్‌వాడీలకు జీతాలు పెరుగుతాయని, ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ టీచర్లకు సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేయించి, రూపొందించిన చీరలను పంపిణీ చేశారు. అంగన్‌వాడీల ద్వారా ప్రయోజనం అర్హత లేని ఒకరిద్దరికి అందినా పర్లేదు కానీ.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అందకుండా ఉందవద్దు అనేది మన నినాదమని అంగన్ వాడీలకు మంత్రి దిశా నిర్ధేశం చేశారు.

    కమిషనర్ దివ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ వార్డులో మన అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారని, వారికి ప్రత్యేక గుర్తింపు కోసం వారికి యూనిఫాం ఉండాలని దీనిని రూపొందించామని మంత్రి అన్నారు. టెస్కో ద్వారా ఈ యూనిఫాంలు సిద్దం చేయించామని, 4 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,34,000 మంది అంగన్‌వాడీ టీచర్లు,హెల్పర్లు, మిని అంగన్‌వాడీ టీచర్లకు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Anganwadi, Govt Jobs 2021, JOBS, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు