టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఏ నిరుద్యోగిని కదిలించినా.. ఈ వ్యహారం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన 4 నోటిఫికేషన్లను రద్దు చేయగా.. మరో మూడు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా పేపర్ లీకయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గ్రూప్ 1 పరీక్ష కూడా రద్దు చేశారు. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ కు నివేదించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ 8 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీని రెండు సార్లు సందర్శించినట్లు తెలిపారు. అవకతవకలు జరుగుతాయనే కారణంగానే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే దురదృష్టకరంగా.. కమిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల కారణంగా పేపర్ లీకైనట్లు తెలిపారు.
ఇది బాధాకరణమని.. విచారణ వ్యక్తం చేశారు. ఇక ముందు ఇటువంటి తప్పులు లేకుండా.. మార్పులు చేస్తామని.. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది వ్యవస్థ తప్పు కాదని.. పొరపాటు జరిగినప్పుడు ఎలా సరిదిద్దాలో సరిచేసే బాధ్యత మాపై ఉందని తెలిపారు. వీటితో పాటు ఇప్పటికే రద్దైన 4 నోటిఫికేషన్లకు సంబంధించి మెటీరియల్ ను ఫ్రీగా అందిస్తామని తెలిపారు. వీటితో పాటు.. ఫ్రీగా స్టడీ సర్కిళ్ల ద్వారా అభ్యర్థులకు కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Minister ktr, TSPSC, TSPSC Paper Leak