ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. త్వరలోనే నల్లగొండ, సిద్దిపేట, రామగుండంలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మంలో ఐటీ హబ్-2 నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మంలో రెండో ఐటీ హబ్ ద్వారా మరో 500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఇప్పటికే మొదటి ఐటీ హబ్ లో 500 మంది పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ. 56 వేల కోట్లు అని మంత్రి చెప్పారు. 2021 నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.40 లక్షల కోట్లకు చేరిందని మంత్రి వివరించారు.
ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీ ఫైబర్ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నామని మంత్రి అన్నారు.
Six MoUs were signed with various IT companies which will set up their offices at IT Hub Phase-II. Minister @KTRTRS handed over the MoU copies to the heads of IT companies. pic.twitter.com/JpQhQvCFk9
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 2, 2021
ఆరు కంపెనీలతో ఎంఓయూ..
ఇదిలా ఉంటే.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్ లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆరు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా యాజమాన్యాలు మంత్రి సమక్షంలో ఎంఓయూ కుదర్చుకున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వారికి అందుకు సంబంధించిన పత్రాలను అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, KTR, Nalgonda, Ramagundam, Siddipet