హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 2 వేల పోలీస్ ఉద్యోగాలు..

Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 2 వేల పోలీస్ ఉద్యోగాలు..

Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 2 వేల పోలీస్ ఉద్యోగాలు..

Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 2 వేల పోలీస్ ఉద్యోగాలు..

Telangana Police Jobs: మంత్రి హరీశ్ రావు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సిద్దిపేటలోని సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌ లో శారీరక ధృడత్వ శిక్షణను పొందుతున్న కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మంత్రి హరీశ్ రావు(Harish Rao) తెలంగాణ(Telangana) నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సిద్దిపేటలోని సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌ లో శారీరక ధృడత్వ శిక్షణను పొందుతున్న కానిస్టేబుల్(Constable), ఎస్‌ఐ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4(Group 4) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు. వీటితో పాటు.. త్వరలో మరో 2వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని.. కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామన్నారు.

APPSC Group 1: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు.. పూర్తి వివరాలిలే..

ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. ఉచిత కోచింగ్ సెంటర్‌లో 1030 మందికి శిక్షణ ఇచ్చామని, జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇక అభ్యర్థులకు పోలీస్ నియమకానికి సబంధించి ప్రిలిమ్స్ ముగిసిందని.. ఈవెంట్స్ అర్హత సాధించి.. మెయిన్స్ లో మంచి మార్కులు పొందే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో అగ్నిపత్ పథకంతో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌తో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఆ ఉద్యోగాలకు యువత సుముఖ చూపడం లేదని హరీష్‌రావు విమర్శించారు. యువత జీవితాన్ని నాశనం చేసే విధంగా ఆర్మీలో అగ్నిపత్ పేరుతో కాంటాక్ట్ విధానం తెచ్చిందని మండిపడ్డారు.

JEE Toppers: ఐఐటీలు, ఎయిమ్స్‌లు మాకొద్దు సార్.. సాధారణ కాలేజీలే కావాలి.. టాపర్ల కీలక నిర్ణయాలు..

ఇదిలా ఉండగా.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో.. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరైతే.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.

దీనిలో పార్ట్ 2 కి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎస్సై సివిల్ పోస్టులకు 1.01 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 1.76 లక్షలు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 1.06లక్షలు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 17,176 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇలా మొత్తం నాన్ టెక్నికల్ పోస్టులు కాకుండా.. 4లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అంటే 96 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు. టెక్నికల్ పోస్టులతో కలుపుకుంటే మొత్తం 4,63,970 దరఖాస్తులు వచ్చాయి.

First published:

Tags: Harish Rao, JOBS, Minister, Tslprb

ఉత్తమ కథలు