తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు(Notifications) వరుసగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2(Group 2), గ్రూప్ 3 వంటి పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలసిందే. వీటికి నోటిఫికేషన్లు(Notifications) డిసెంబర్ మొదటి వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా మంత్రి హరీశ్ రావు టీచర్ల రిక్రూట్ మెంట్ కు(Teacher Recruitment) సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు (Harish Rao) చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని.. వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకునే వారు లేరని కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. వాటిని తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇక ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా పదిహేను యూనివర్సిటీల బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ బిల్లు ను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అయితే.. ఈ బిల్లుపై గవర్నర్ సందేహాలను వ్యక్తం చేయడంతో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , అధికారులు గవర్నర్ ను కలిసి సందేహాలను నివృత్తి చేశారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అధికారులు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బోర్డు ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ కలిగిన వారిని ఆచార్యులుగా నియమించనున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బోర్డులో సభ్యులుగా ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, JOBS, Teacher jobs, Telangana government jobs