MINISTER HARISH RAO SAID KCR DECISION ON GROUP 1 APPOINTMENTS IS GREAT FUTURE WE WILL DECLARES JOB CALENDAR EVK
TS Job News: గ్రూప్-1 నియామకాల్లో కేసీఆర్ నిర్ణయం చాలా గొప్పది.. భవిష్యత్తులో ఉద్యోగ క్యాలెండర్: మంత్రి హరీశ్‌రావు
మంత్రి హరీశ్ రావు (ఫైల్)
TS Job News: తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నట్టుగానే పోలీస్‌శాఖలో ఖాళీల భర్తీపై నోటిఫికేషన్ వచ్చేసింది. గ్రూప్‌కు సంబంధించి నియామక ప్రక్రియను ప్రకటించిన సర్కారు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 భర్తీపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నట్టుగానే పోలీస్‌శాఖలో ఖాళీల భర్తీపై నోటిఫికేషన్ వచ్చేసింది. గ్రూప్‌కు సంబంధించి నియామక ప్రక్రియను ప్రకటించిన సర్కారు ప్రారంభించింది. సోమవారం సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-1లోనూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేయటం గొప్ప విషయమని, ఈ ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని హరీశ్‌రావు తెలిపారు. గ్రూప్-1 క్యాడర్లో గతంలో ఉద్యోగాలు 60 శాతం స్థానికులకు, 40 శాతం నాన్‌లోకల్ వారికి ఉండేవాని వెల్లడించారు.
317జీవో నిరుద్యోగుల కోసమే..
ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవోపై మంచీ చెడు చూడకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయన్నారు. నిరుద్యోగులకు మేలు జరిగేలా 317జీవోను తీసుకొచ్చామన్నారు. 500కు పైగా గ్రూప్-1 ఉద్యోగాలు రాబోతుండటం చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. కష్టపడే అభ్యర్థులకు అన్యాయం జరుగొద్దనే ఇంటర్వ్యూలు కూడా తీసేశారని చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు.
తెలంగాణలో 16,027 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకితెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) రెండు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా అప్లై చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ వివరాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో వెల్లడించింది.
గ్రూప్-1పై కీలక జీవో విడుదల..
తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ (TSPSC Group 1) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక జీవో 55ను విడుదల చేసింది. దీనిద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్టయింది. ఉద్యోగాల భర్తీ విధానంలో పలు మార్పులు చేయటమే కాకుండా, పోస్టుల విభజన, పరీక్ష విధానాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో 55ను జారీచేశారు. గతంలో జారీచేసిన జీవో 11ను సవరించి, కొత్త జీవోను విడుదల చేశారు. గ్రూప్ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉన్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.