(K.Veeranna,News18,Medak)
మౌళిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న సిద్దిపేటSiddipeta జిల్లా ఇప్పుడు విద్య పరంగా కూడా రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇందుకు కారణమైన స్టూడెంట్స్(Students)ని అభినందిస్తూ .. మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేసిన జిల్లా అధ్యాపక, అధికార యంత్రాంగానికి జిల్లా మంత్రి(Minister) హరీష్‌రావు(HarishRao)అభినందనలు తెలిపారు.
చదువులోనూ సిద్దిపేట టాప్..
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా సిద్ధిపేట నిలిచింది. అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా ఇప్పుడు పదవ తరగతి ఫలితాల్లో కూడా తమ సత్తా చాటుకొని ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో టెన్త్ ఫలితాల్లో రెండు, మూడో స్థానాలకు పరిమితమైన సిద్దిపేట జిల్లా ఈసారి మాత్రం రాష్ట్రంలోనే నెంబర్ జిల్లాగా నిలిచింది. సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా మంత్రి హరీష్‌రావు పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో సిద్దిపేట 13వ స్థానంలో ఉండగా ..ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత 9,6వ స్థానాల్లో కొనసాగింది.
Siddipet emerges as the best performing district in Telangana SSC 10th result 2022 with 97.75 pass percentage. In a testimony to focus laid on the Education sector, under Hon’ble CM KCR's leadership 90% of students cleared SSC in the state. Congratulations to all the students pic.twitter.com/BgDLdjRTu4
— Harish Rao Thanneeru (@trsharish) June 30, 2022
టెన్త్ ఫలితాల్లో ప్రథమస్థానం..
గత రెండేళ్లలో పదవ తరగతి ఫలితాల్లో ఒకసారి 3వ స్థానం, మరోసారి రెండో స్థానంలో నిలిచింది సిద్ధిపేట. ఈ ఏడాది పరీక్షలకు ముందే జిల్లా మంత్రి హరీష్‌రావు ఈసారి టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట తప్పని సరిగా ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలని జిల్లా యంత్రాంగం , విద్యాశాఖాధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో సైతం తెలిపారు. అన్నింటిలో ఆదర్శంగా ఉన్న సిద్దిపేట పది ఫలితాల్లో ఆదర్శంగా నిలవాలనే ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గురువారం వెలువడిన ఫలితాలే అందుకు నిదర్శనంగా కనపిస్తున్నాయి.
అభినందనలు తెలిపిన మంత్రి..
పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్ రావడంపై జిల్లా మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫలితం కోసం గత మూడేళ్లుగా మంత్రి పడిన శ్రమ, అధికారులు, స్టూడెంట్స్ పట్ల చూపిస్తున్న చొరవ ఫలించింది. పదవ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, విద్యాశాఖ అధికారులకు , ఉపాధ్యాయులను మంత్రి హరీష్‌రావు అభినందించారు. అదేవిధంగా పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో చదివి జిల్లాను ప్రతి సంవత్సరం ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్తిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana ssc results