దేశంలోని మినీ రత్న కంపెనీల్లో ఒక్కటైన SJVN లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఫీల్డ్ ఇంజనీర్ పోస్టును భర్తీ చేయనుంది. ముఖ్యంగా సోలార్(Solar) మరియు విండ్ ఎనర్జీ విభాగంలో అనుభవం ఉన్న నిపుణుల నుంచి కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులను కాంట్రాక్టు(Contract) ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. కాంట్రాక్టు కాల పరిమితి మూడు సంవత్సరాలుగా ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో రెండు సంవత్సరాలు కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థి ఒప్పందం అనంతరం ఎటువంటి సడలింపు పొందలేదు. ఒప్పందం ప్రకారం కాలపరిమితిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, వయోపరిమితి, ముఖ్యమైన తేదీలు, పరీక్షా నమూనా, సిలబస్(Syllabus), ఎంపిక ప్రక్రియ తెలుసుకుందాం.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టుపేరు | అర్హతలు | ఖాళీలు |
ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి, అంతే కాకుండా రెండు సంవత్సరాల సోలార్, విండ్ పవర్ విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించరాదు. | 4 |
ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) | మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సోలార్, విండ్ పవర్ విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించరాదు. | 4 |
IIT Education: ఐఐటీలో ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్‌లు.. చదవొచ్చు
దరఖాస్తు చేసుకొనే విధానం..
- అధికారిక వెబ్సైట్: www.sjvn.nic.in ను సందర్శించాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫాంను ఓపెన్ చేయాలి (ఆన్లైన్ అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
- పోర్టల్‌లో ఇచ్చిన స్థలంలో వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హత వివరాలను అందించాలి.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు కాపీని డిజిటల్ ఫార్మాట్(Digital Format)లో (.jpg లేదా .jpeg ఫైల్ మాత్రమే, 500 KB సైజు కంటే తక్కువ) అప్లోడ్ చేయాలి.
- ఆన్లైన్(Online)లో దరఖాస్తు చేసిన తర్వాత, అప్లికేషన్ ఫారమ్ (ప్రివ్యూ) ప్రింటౌట్(Printout) తీసుకొని దాచుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 11, 2021
ఎంపిక విధానం..
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తారు.
- దరఖాస్తు దారులకు నుంచి అభ్యర్థులను షార్ట్ లిస్ట్(Short List) చేస్తారు.
- ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులకు మెయిల్(Mail) ద్వారా సమాచారం అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.