హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి మరో జాబ్ మేళా.. రూ.16 వేల వరకు వేతనం..

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి మరో జాబ్ మేళా.. రూ.16 వేల వరకు వేతనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఈ నెల 27న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Hyderabad

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) శుభవార్త చెప్పింది. ఈ నెల 27న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో Kusalava Hyundai, Apollo Pharmacies Ltd సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Kusalava Hyundai: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ప్యాకర్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.

Interview tips : జాబ్ ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఈ 5 సింపుల్ ప్రశ్నలకు ప్రిపేర్ అయితే చాలు!

Apollo Pharmacies Ltd: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, ఫర్మాసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీ/ఎం/డీ ఫార్మసీ అర్హతతో పాటు పీసీఐ సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎన్టీఆర్ , గుంటూరు , పల్నాడు, బాపట్ల, చీరాల, ప్రకాశం , కృష్ణ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10,110 నుంచి రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, రామేష్ హాస్పటల్స్ ఎదురుగా, విజయవాడ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇతర పూర్తి విరాలకు 9700092606 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు