MINI JOB MELA AT HYDERABAD DISTRICT EMPLOYMENT OFFICE TODAY BS
Jobs: నేడు హైదరాబాద్‌లో జాబ్ మేళా.. నిరుద్యోగులకు సదావకాశం..
(ప్రతీకాత్మక చిత్రం)
Job Mela in Hyderabad : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ రోజు జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి ఎన్.మైత్రిప్రియ తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ రోజు జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి ఎన్.మైత్రిప్రియ తెలిపారు. యువతీ, యువకులకు వివిధ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్స్, అపోలో హోమియోకేర్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, వే సాఫ్ట్ టెక్నాలజీస్, శ్రీరాం చిట్స్ తదితర సంస్థల్లో 400 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు విజయనగర్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు బయోడేటాతో హాజరుకావాలని, వివరాలకు 8247656356 లో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.