ఇంటర్ పాసైన అమ్మాయిలకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఇది మంచి అవకాశం. మిలిటరీ నర్సింగ్ సర్వీస్-MNS 2020 కోర్సును ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్-MNS ఓ విభాగం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్-AFMS వైద్యపరమైన సేవల్ని అందిస్తుంది. ఆర్మీ మెడికల్ కార్ప్స్, ఆర్మీ డెంటల్ కార్ప్స్‌తో పాటు మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ విభాగం కూడా ఉంటుంది. మిలిటరీ నర్సింగ్ సర్వీస్-MNS 2020 కోర్సులో 220 మంది అమ్మాయిల్ని చేర్చుకుంటోంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు వేర్వేరు నర్సింగ్ కాలేజీల్లో నాలుగేళ్ల బీఎస్‌సీ నర్సింగ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ తర్వాత మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో సేవల్ని అందించాలి. నవంబర్ 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 220
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె- 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా- 30
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అశ్విని- 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, న్యూఢిల్లీ- 30
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లక్నో- 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు- 40
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 2
పరీక్ష తేదీ- 2020 ఏప్రిల్
విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బాటనీ & జువాలజీ), ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50% మార్కులతో రెగ్యులర్ కోర్సులో 10+2 పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.750
పుట్టిన తేదీ- 1995 అక్టోబర్ 1 నుంచి 2003 సెప్టెంబర్ 30 మధ్య పుట్టినవారే దరఖాస్తు చేయడానికి అర్హులు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
TSSPDCL Syllabus: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగానికి అప్లై చేశారా? సిలబస్ ఇదే...
CISF Jobs: గుడ్ న్యూస్... 1,314 ఏఎస్సై ఉద్యోగాలకు సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్... వివరాలివే
Railway Jobs: గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే పోస్టుల భర్తీ... వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.