MIGRATION CERTIFICATE NOT MANDATORY FOR NEET UG COUNSELLING 2021 SAYS MCC GH VB
NEET UG 2021: నీటి అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ లో ఆ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.. కానీ..
ప్రతీకాత్మక చిత్రం
వైద్య విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ MCC నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌన్సెలింగ్లో సమర్పించాల్సిన డాక్యుమెంట్లలో ఆ సర్టిఫికెట్ ముఖ్యమైనదే కానీ తప్పనిసరేమీ కాదని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)–2021 కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండు రౌండ్లు పూర్తయ్యాయి. సీటు దక్కిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేస్తున్నారు. అయితే, విద్యార్థులు తమ మైగ్రేషన్ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని నీట్–2021 నోటిఫికేషన్లో(Notification) పేర్కొనడంతో సమస్య తలెత్తింది. అన్ని కాలేజీలు విద్యార్థులను మైగ్రేషన్ సర్టిఫికెట్(Certificate) సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో, అభ్యర్థులు నుంచి పెద్ద ఎత్తున మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC)కి విజ్ఞప్తులు అందాయి. దీంతో, విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ MCC మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌన్సెలింగ్లో సమర్పించాల్సిన డాక్యుమెంట్లలో మైగ్రేషన్ సర్టిఫికెట్ ముఖ్యమైనదే కానీ తప్పనిసరేమీ కాదని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను కౌన్సిల్ అధికారిక వెబ్సైట్ www.mcc.nic.in లో పెట్టింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం మైగ్రేషన్ సర్టిఫికేట్ లేని కారణంగా ఏ మెడికల్ కాలేజ్ కూడా ఏ ఒక్క స్టూడెంట్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయకూడదని స్పష్టం చేసింది. కాలేజీలో రిపోర్టింగ్ కోసం ఇకపై “తప్పనిసరి” పత్రం కాదు. ఇది ఆప్షనల్ సర్టిఫికెట్ మాత్రమే అని స్పష్టం చేసింది. మైగ్రేషన్ సర్టిఫికెట్ లేని కారణంగా విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయకూడదని, ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేసేందుకు గాను 7 రోజుల సమయం ఇవ్వాలని కాలేజీలను కోరింది. వారం రోజుల్లోగా మైగ్రేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తామనే షరతు మీద విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని పేర్కొంది. మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించే వరకు, విద్యార్థులకు తాత్కాలిక ప్రవేశం కల్పించాలని ఎమ్సీసీ కాలేజీలకు సూచించింది. మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకపోతే, వారి ప్రవేశాన్ని రద్దు చేయకుండా తాత్కాలిక ప్రాతిపదికన అడ్మిన్ ఇవ్వాలని అన్ని మెడికల్ కాలేజీలను సర్క్యులర్ జారీ చేసింది.
మార్చి 10 నుంచి మాప్అప్ రౌండ్ రిజిస్ట్రేషన్లు షూరూ..
ఇదిలా ఉంటే, NEET UG కౌన్సెలింగ్ 2021 కోసం MCC రౌండ్ 2 ఫలితాలను ఫిబ్రవరి 27న విడుదల చేసింది. mcc.nic.inలో సీటు దక్కిన అభ్యర్థుల లిస్ట్ పెట్టింది. సీటు దక్కిన వారు తమ సీట్ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక, మార్చి 10 నుండి, నీట్ కౌన్సెలింగ్ 2021 మాప్-అప్ రౌండ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. నీట్ రెండో రౌండ్లో పాల్గొనని అభ్యర్థులకు మాప్ -అప్ రౌండ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నీట్ కౌన్సెలింగ్ 2021 మాప్-అప్ రౌండ్ ఫలితాలను మార్చి 19న ప్రకటిస్తారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ (AFMS), ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే సెంట్రల్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు సైతం నీట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.