ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉద్యోగాల భర్తీకి భారీగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. IOCL, BHEL, BEL, DRDO, HPCL లాంటి సంస్థలు వరుసగా నియామకాలు చేపడుతున్నాయి. తాజాగా భారత రక్షణ మంత్రిత్వ (Defence Ministry) శాఖకు చెందిన మినీరత్న కంపెనీ అయిన హైదరబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పలు విభాగాల్లో 61 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 1న ప్రారంభమైంది. దరఖాస్తులకు జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
పోస్టు | ఖాళీలు |
మేనేజ్మెంట్ ట్రైనీ | 53 |
అసిస్టెంట్ మేనేజర్ | 06 |
మేనేజర్ | 2 |
మొత్తం | 61 |
మేనేజ్మెంట్ ట్రైనీ: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్/హెచ్ఆర్, సివిల్, సేఫ్టీ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.31.60 లక్షల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. ఇంటర్ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
అసిస్టెంట్ మేనేజర్: మెటీరియల్స్ మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, మెడికల్, ఐటీ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. పోస్టు ఆధారంగా ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 9 లక్షల నుంచి రూ. 31.60 లక్షల వేతనం చెల్లించనున్నారు.
మేనేజర్: ఆటోమేషన్, మెకానికల్ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా ఏడాదికి రూ.13.50 లక్షల నుంచి రూ.40.70 లక్షల వేతనం చెల్లిస్తారు.
అభ్యర్థులు అనుభవానికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా ఎంపిక చేస్తారంటే..
మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు మొదటగా రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా www.midhani-india.in ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం కెరీర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: తర్వాత Click here for E-recruitment ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. APPLY MIDHANI POSTS అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: తర్వాత, పేరు, ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాలి.
Step 6: చివరగా అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.