హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం

MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం

MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Recruitment 2021 | ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లోని మిధాని వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. నెల్లూరులోని యూనిట్‌లో కూడా పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI సంస్థకు చెందిన ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్-UADNL పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని మిధాని నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలోని అల్యూమినియం ప్లాంట్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయి. కంపెనీ సెక్రెటరీ, ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు వేతనం రూ.72,000 వరకు ఉంటుంది. ఇవి మూడేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులు. పోస్టింగ్ నెల్లూరులోనే ఉంటుంది. లేదా అవసరాన్ని బట్టి దేశంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

Army Recruitment Rally: ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అప్లై చేయండిలా

Army Public School Jobs: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

MIDHANI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 4

కంపెనీ సెక్రెటరీ (గ్రేడ్ 3)- 1

ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 4-పర్చేస్)- 1

ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 2-ఫైనాన్స్)- 1

ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 2-ప్రాజెక్ట్స్)- 1

MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SSC CGL Notification 2021: డిగ్రీ పాసైనవారికి 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... అప్లై చేయండిలా

MIDHANI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 2 సాయంత్రం 5 గంటలు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వేతనం- కంపెనీ సెక్రెటరీ పోస్టుకు రూ.60,500, ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 4-పర్చేస్) పోస్టుకు రూ.72,600, ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 2-ఫైనాన్స్), ఎగ్జిక్యూటీవ్ (గ్రేడ్ 2-ప్రాజెక్ట్స్) పోస్టులకు రూ.48,500.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

DGM (HR)-Nellore Plant,

Mishra Dhatu Nigam Ltd,

PO. Kanchanbagh, Hyderabad - 500058.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, Hyderabad, Hyderabad news, Job notification, JOBS, Nellore, Nellore Dist, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు