హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MIDHANI: Mishra Dhatu Nigam Jobs: కేంద్ర ప్రభుత్వం సంస్థ మిధానీలో జాబ్స్..అప్లయ్ చేయండిలా..

MIDHANI: Mishra Dhatu Nigam Jobs: కేంద్ర ప్రభుత్వం సంస్థ మిధానీలో జాబ్స్..అప్లయ్ చేయండిలా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

  కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఇందులో భాగంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని మినీరత్న సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మిశ్రా ధాతు నిగమ్ మిధాని లో పలు పోస్టుల్లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మిశ్రా ధాతు నిగమ్ మిధాని నోటిఫికేషన్ గురించి వివరాలు, ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, దరఖాస్తు మరియు ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  మొత్తం ఖాళీలు: 07 పోస్టులు

  -ఖాళీలు ఇవే..

  1) అసిస్టెంట్ మేనేజర్-02,

  2) మేనేజర్-02,

  3) డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-01.

  అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఐసీడబ్ల్యూఏ/ సీఏలో అసోసియేట్ మెంబర్షితో పాటు అనుభవం.

  ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

  దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.

  దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 24.

  వెబ్ సైట్: https://midhaninindia.in/

  చిరునామ : మిశ్రా దాటు నిగమ్ లిమిటెడ్ PO – కాంచాన్ బాగ్, హైదరాబాద్ – 500058, తెలంగాణ, ఇండియా

  RBI Internship : ఆర్‌బీఐలో ప‌ని చేయాల‌నుకొంటున్నారా..? అయితే ట్రై చేయండి


  బ్యాంక‌ర్స్ బ్యాంక్‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం అందిస్తోంది. ఆర్‌బీఐలో విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెష‌ర్ల‌కు వార్షిక వేసవి ఇంటర్న్‌షిప్ (Internship) ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు ఫైనాన్స్, ఎకనామిక్స్ (Economics), లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ స‌మ్మర్ ప్లేస్‌మెంట్స్ కోసం మొత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైఫండ్ అందజేస్తారు. శిక్షణ (Training) పొందినవారు ముంబై (Mubai)కి మరియు తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను భరించాలి. వారి వసతి ఏర్పాట్లను కూడా వారే స్వయంగా చూసుకోవాలి.

  విద్యార్థుల‌కు కావాల్సిన అర్హ‌త‌లు

  - మేనేజ్‌మెంట్, కామర్స్, స్టాటిస్టిక్స్, లా, ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ లేదా భారతదేశంలోని ప్రముఖ కళాశాలలు, సంస్థల నుంచి న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తి-సమయం ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీలో సమగ్ర ఐదేళ్ల లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించి ఉండాలి.

  దరఖాస్తు యొక్క ముందస్తు కాపీని cgminchrmd@rbi.org.in కు ఈ-మెయిల్ చేయవచ్చు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Govt Jobs 2021

  ఉత్తమ కథలు