MIDHANI Recruitment 2020: హైదరాబాద్ మిధానిలో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

MIDHANI Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని మిధానిలో 158 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: October 5, 2020, 6:37 PM IST
MIDHANI Recruitment 2020: హైదరాబాద్ మిధానిలో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
MIDHANI Recruitment 2020: హైదరాబాద్ మిధానిలో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్‌ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 158 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది మిధాని. ఇవి ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మిధాని అధికారిక వెబ్‌సైట్ https://midhani-india.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఇందులో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా అంటే అక్టోబర్ 16 లోగా పంపాలి.

Army Public School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 పోస్టులకు అప్లై చేయండి ఇలా

TCS National Qualifier Test: ఈ పరీక్ష పాసైతే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగావకాశాలు... అప్లై చేయండిలా

MIDHANI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 158
ఫిట్టర్- 50
ఎలక్ట్రీషియన్- 48మెషినిస్ట్- 20
టర్నర్- 20
వెల్డర్- 20

ISRO Recruitment 2020: ఇస్రోలో ఉద్యోగాలు... టెన్త్ పాసైనవారూ అప్లై చేయొచ్చు

Online Courses: కేరళ యువతి సంచలనం... 90 రోజుల్లో 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి

MIDHANI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 16
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు అప్లై చేయాలి.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్ లిస్ట్
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy Manager (TIS & Apprenticeship Training),
Mishra Dhatu Nigam Limited,
Kanchanbagh, Hyderabad – 500058.
Published by: Santhosh Kumar S
First published: October 5, 2020, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading