Home /News /jobs /

MIDHANI RECRUITMENT 2020 MISHRA DHATU NIGAM LIMITED CONDUCTING WALK IN INTERVIEW FOR 29 POSTS KNOW NOTIFICATION DETAILS SS

MIDHANI Jobs 2020: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

MIDHANI Jobs 2020: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
(ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Jobs 2020: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)

MIDHANI Recruitment 2020 | హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిధానీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 29 ఖాళీలను ప్రకటించింది. ఇవి ఏడాది గడువు ఉన్న పోస్టులు మాత్రమే. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు 2020 డిసెంబర్ 3, 5 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్ పోస్టులకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

    Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో జాబ్స్... 2 రోజుల్లో అప్లై చేయండి

    Indian Air Force Jobs: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

    MIDHANI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 29
    అసిస్టెంట్ లెవెల్ 2 వెల్డర్- 9
    అసిస్టెంట్ లెవెల్ 2 ఫిట్టర్- 20

    RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    SBI Jobs 2020: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 8500 అప్రెంటీస్ పోస్టులు... అప్లై చేయండి ఇలా

    MIDHANI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- వెల్డర్, ఫిట్టర్ పోస్టులకు ఎస్ఎస్‌సీ, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. కనీసం నాలుగేళ్లు అనుభం తప్పనిసరి.
    వేతనం- రూ.24,180
    వయస్సు- 2020 నవంబర్ 11 నాటికి 30 ఏళ్ల లోపు
    అసిస్టెంట్ లెవెల్ 2 ఫిట్టర్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 డిసెంబర్ 3
    అసిస్టెంట్ లెవెల్ 2 వెల్డర్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 డిసెంబర్ 5
    వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం- Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad – 500058
    వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే సమయం- అభ్యర్థులు ఉదయం 7.30 గంటల్లోగా ఇంటర్వ్యూ నిర్వహించే స్థలానికి చేరుకోవాలి. 11 గంటల తర్వాత ఇంటర్వ్యూకు ఎవరినీ అనుమతించరు.
    ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్- అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి. ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లాలి. డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు, అనుభవం, ఈఎస్ఐ, పీఎఫ్ స్టేట్‌మెంట్స్, కుల ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
    ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు