MICROSOFT RECRUITMENT 2022 FOR ENGINEERS APPLICATIONS INVITED FOR NEW PROGRAM MANAGER VACANCIES GH VB
Microsoft Jobs: గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Microsoft Jobs: దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) కొత్త సంవత్సరం ప్రారంభంలోనే భారీ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్(Notification) జారీచేసింది. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో (MSIDC) ఫుల్‌టైం ప్రోగ్రామ్ మేనేజర్(Fulltime Programme Manager) ఖాళీలను భర్తీ చేయనుంది మైక్రోసాఫ్ట్(Microsoft).
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్(Microsoft) కొత్త సంవత్సరం ప్రారంభంలోనే భారీ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్(Notification) జారీచేసింది. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో (MSIDC) ఫుల్‌టైం ప్రోగ్రామ్ మేనేజర్ (Fulltime Programme Manager) ఖాళీలను భర్తీ చేయనుంది మైక్రోసాఫ్ట్(Microsoft). అమెరికాలోని ప్రధాన కార్యాలయం వెలుపల మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు (Microsoft Corporations) ఉన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ (R&D) కేంద్రాల్లో హైదరాబాద్ క్యాంపస్ ఒకటి. ఇది 1998లో ఏర్పాటైంది. ప్రస్తుత పోస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు సంస్థను నడిపించే బాధ్యతను కలిగి ఉంటారని మైక్రోసాఫ్ట్ (Microsoft engineer) ఓ ప్రకటనలో పేర్కొంది. తదుపరి తరం సాఫ్ట్వేర్ పరిష్కారాల రూపకల్పన, అమలు, మార్కెటింగ్ వంటివాటిపై వీరు పనిచేయాల్సి ఉంటుంది.
ఎవరు అర్హులు?
ప్రోగ్రామ్ మేనేజర్(Microsoft program manager) ఖాళీల కోసం కింది అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొంది. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ లేదా ఎంఎస్ డిగ్రీ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్కి చెందిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. భారతదేశంలోని టైర్-I మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ(MBA) లేదా తత్సమాన విద్యను అభ్యసిస్తున్నవారు అర్హులే.
ఏదైనా టెక్నికల్ సంస్థలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో 2-4 సంవత్సరాల సంబంధిత పని అనుభవం ఉన్నవారు ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు అర్హులు. స్పీకింగ్ అండ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంజినీర్లు అప్లై చేసుకోవచ్చు. బృందాలతో కలసి పనిచేసిన సామర్థ్యం, టీమ్ మేనేజ్మెంట్నూ అర్హతగా పరిగణిస్తోంది సంస్థ.
సెలక్టయిన వారి బాధ్యతలు..
ప్రొడక్ట్ స్ట్రాటజీ రోడ్‌మ్యాప్: ప్రొడక్ట్‌కు సంబంధించిన వ్యూహాలు రూపొందించడం, ప్రొడక్టివిటీ రోడ్‌మ్యాప్ తయారీ, అమలు, టార్గెటెడ్ ప్రొడక్టివిటీ, పోటీకి అనుగుణంగా మార్కెట్, భాగస్వామ్యాల విధానాన్ని గుర్తించడం.. వంటి అంశాలపై పనిచేయాలి.
ప్రొడక్ట్ డిజైనింగ్ (Product): స్టోరీబోర్డింగ్, స్కెచింగ్, డిజైనింగ్, ప్రాధాన్యతల గుర్తింపు, టైమ్లైన్ల విధింపు, టీమ్ భాగస్వామ్యం, కిందిస్థాయి ఉద్యోగులకు సంబంధించి వివిధ పరిష్కారాలను అందించడం, వినియోగదారులకు సంబంధించి అధ్యయనాలు, సంస్కరణల ప్రణాళికలను రూపొందించడం, మార్కెటింగ్ ప్లాన్లు.
కనెక్ట్ విత్ కస్టమర్: కస్టమర్ కనెక్ట్ ద్వారా సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం, డేటా విశ్లేషణ, అభిప్రాయ సేకరణ, వంటివి.
పైన పేర్కొన్న అర్హతలు, వివిధ బాధ్యతల నిర్వహణకు సుముఖంగా ఉంటే, అధికారిక వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.