Microsoft: ఇంజనీరింగ్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లు.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉపయోగపడనున్న సర్టి

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఉద్యోగాల్లో అవసరమయ్యే నైప?

  • Share this:
ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఉద్యోగాల్లో అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించడంతో పాటు ఈ రంగంలో భారతీయులను శక్తిమంతం చేయడానికి ‘ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రాం’ పేరుతో ఈ ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ అజూర్, గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపారంలో సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి అభ్యర్థులను సంసిద్ధం చేయడమే ఈ ప్రోగ్రాం లక్ష్యమని సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది. మొత్తం 50,000 మందికి వర్చువల్ విధానంలో ఇంటర్న్‌షిప్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

సంస్థకు చెందిన లెర్నింగ్ ప్లాట్‌ఫాం.. ‘మైక్రోసాఫ్ట్ లెర్న్’ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్, సర్టిఫికేషన్‌లను మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులు GitHub స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌కి యాక్సెస్ పొందుతారు. దీంట్లో ‘అజూర్ ఫర్ స్టూడెంట్స్’ కూడా ఉంటుంది.

* అర్హత, దరఖాస్తు ప్రక్రియ
2021లో గ్రాడ్యుయేట్ అయిన లేదా 2022, 2023లో గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులకు ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుంది. ఇంజనీరింగ్‌లో అన్ని స్పెషలైజేషన్‌ల విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. ఇంటర్న్‌షిప్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫ్యూచర్ రెడీ టాలెంట్ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 8 వారాలుగా ఉంటుంది.

మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE).. నాస్కామ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సంయుక్తంగా ప్రారంభించిన ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్.. ఎర్నెస్ట్ & యంగ్ (EY), GitHub, క్వెస్ కార్ప్ వంటి సంస్థలు ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నాయి.

ఈ ఇంటర్న్‌షిప్ కోసం ‘నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్‌’ కు సంబంధించిన కోర్సుల అలైన్‌మెంట్‌ను SSC నాస్కామ్ అందిస్తుంది. ఈ కోర్సులను ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్‌’ ఇనిషియేటివ్‌కు లింక్ చేస్తుంది. టెక్నాలజీ, ఇండస్ట్రీ మెంటర్‌షిప్‌ను EY సంస్థ అందిస్తుంది. గిట్‌హబ్ సంస్థ తమ ‘GitHub స్టూడెంట్ డెవలపర్ ప్యాక్’ ద్వారా విద్యార్థులకు బెస్ట్ డెవలపర్ టూల్స్‌కి ఉచితంగా యాక్సెస్‌ అందిస్తుంది. క్వెస్ కార్ప్ సంస్థ విద్యార్థుల కోసం వర్చువల్ కెరీర్ ఫెయిర్‌ నిర్వహిస్తుంది.
Published by:Krishna Adithya
First published: