Microsoft Bonus: ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందించిన తమ ఉద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ బోనస్ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలమైంది. ప్రతీ ఒక్కరిపై ఈ వైరస్ ప్రభావం ఎంతో కొంత పడింది. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. ఉద్యోగం, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు మరి కొందరు. అయితే.. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అనేక కంపెనీల ఉద్యోగులు తమ సేవలను అందించారు. దీంతో అనేక అగ్రకంపెనీలు తమ ఉద్యోగులకు భారీ స్థాయిలో బోనస్ అందించి వారిలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ జాబితాలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఫేస్ బుక్ సంస్థ సైతం 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 1000 డాలర్లను బోనస్ గా ఇచ్చింది. అమెజాన్ సైతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు 300 డాలర్లను బోనస్ గా ప్రకటించింది. తాజగా టెక్ దిగ్గజం మైక్సోసాఫ్ట్ తమ ఉద్యోగులకు భారీ బోనస్ అందించి తన ప్రత్యేకతను చాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 1500 డాలర్ల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1.12 లక్షలు అన్నమాట.
    Samsung Scholarships: విద్యార్థులకు సాంసంగ్ స్కాలర్​షిప్​​​​... ఎలా ఎంపిక చేస్తారంటే

    ఈ డబ్బులను సింగిల్ టైం బోనస్ గా అందించనుంది మైక్రోసాఫ్ట్. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు అందించిన తోడ్పాటు, వారి కృషికి గుర్తింపుగా ఈ బోనస్ అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మార్చికి ముందు ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని సంస్థ వివరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న మొత్తం 1,17,508 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగాలకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగులకు అందించే మొత్తం బోనస్ విలువ దాదాపు 200 మిలియన్ డాలర్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఈ మొత్తం మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు రోజుల ఆదాయం కన్నా కూడా తక్కువే కావడం విశేషం.

    ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా స్కూళ్లు మూసివేయడంతో పిల్లలందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. కోవిడ్ తరువాత విద్యా బోధన ఆన్‌లైన్‌కు మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అందరికీ ఆన్ లైన్ క్లాసులు వినడం సాధ్యపడట్లేదు. ముఖ్యంగా పేద, బలహీన వర్గాల విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. వీటిని కొనుగోలు చేయడం ఆయా కుటుంబాలకు శక్తికి మించిన భారంగా మారింది. ఇలాంటి వారి కష్టాలను తీర్చేందుకు జార్ఖండ్ పోలీసులు ముందుకు వచ్చారు. అలాంటి విద్యార్థులకు త్వరలోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు రిపేర్ చేసి.. ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు వారు వెల్లడించారు.
    Published by:Nikhil Kumar S
    First published: