SBI-Microsoft: గుడ్ న్యూస్... 500 మంది యువతీయువకులకు ఎస్‌బీఐ-మైక్రోసాఫ్ట్ శిక్షణ

SBI-Microsoft: గుడ్ న్యూస్... 500 మంది యువతీయువకులకు ఎస్‌బీఐ-మైక్రోసాఫ్ట్ శిక్షణ (ప్రతీకాత్మక చిత్రం)

Microsoft SBI Foundation three-year program | ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు, దివ్యాంగులు సరైన నైపుణ్యాలతో ఈ రంగంలో అడుగుపెట్టేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

  • Share this:
    బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI రంగంలో యువతీయువకులకు అవకాశాలు కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫౌండేషన్‌తో మైక్రోసాఫ్ట్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ కోర్టోయిస్ కలిసి మూడేళ్ల ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేశారు. BFSI రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా దివ్యాంగులకు టెక్నాలజీలో శిక్షణ అందిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ నుంచి మొదటి ఏడాదిలోనే 500 మందికి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. శిక్షణ కోసం కొన్ని ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమకు చెందిన నైపుణ్య శిక్షణా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థల సహకారం తీసుకోనున్నారు.


    ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు, దివ్యాంగులు సరైన నైపుణ్యాలతో ఈ రంగంలో అడుగుపెట్టేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ రంగంలో దివ్యాంగులు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఎస్‌బీఐ, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి తెలంగాణలో 1466 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    CDAC Recruitment 2020: సీడాక్‌లో 131 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
    Published by:Santhosh Kumar S
    First published: