MICA AHMEDABAD ADVANCED CERTIFICATION PROGRAM IN DIGITAL MARKETING COMMUNICATION RECENTLY LAUNCHED MUDRA INSTITUTE GH VB
MICA Ahmedabad: కొత్త సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన MICA.. ఆ వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
అహ్మదాబాద్‌కు చెందిన ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ (MICA).. డిజిటల్ మార్కెటింగ్- కమ్యూనికేషన్‌పై అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను అందించనుంది. edtech, upGrad ఎడ్ టెక్ కంపెనీల సహాయంతో ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో 50వ కోహోర్ట్‌ను (బ్యాచ్) ప్రారంభించింది.
అహ్మదాబాద్‌కు(Ahmedabad) చెందిన ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ (MICA).. డిజిటల్ మార్కెటింగ్- కమ్యూనికేషన్‌పై(Communication) అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను(Advanced Certificate Programme) అందించనుంది. edtech, upGrad ఎడ్ టెక్ కంపెనీల సహాయంతో ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో 50వ కోహోర్ట్‌ను (బ్యాచ్) ప్రారంభించింది. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్‌కు(Digital Marketing) డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ ప్రోగ్రామ్ కోసం ఎక్కువ మంది నమోదు చేసుకుంటున్నారని.. ప్రోగ్రెసివ్ కెరీర్ గ్రోత్ కోసం అప్ స్కిల్లింగ్ ఎంపికలను మూల్యాంకనం చేయడానికి ప్రారంభం నుంచి మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉందని ఎడ్టెక్ తెలిపింది.
ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి భాగస్వామ్యంలో భాగంగా 10వేల మంది అభ్యాసకులతో నమోదు చేయించుకున్నామని.. ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అభ్యాసకులకు గరిష్ట జీతం 300 శాతం పెంపుతో ప్రారంభమవుతుందని ఎడ్టెక్ వివరించింది. అప్‌గ్రాడ్ డేటా ల్యాబ్స్ ప్రకారం... Q3FY22లో డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన అప్‌గ్రాడ్ అభ్యాసకులలో 87 శాతం మంది జీతాల పెంపుదల, ప్రమోషన్ల రూపంలో అర్థవంతమైన కెరీర్ ఫలితాలను సాధించారని.... అగ్రశ్రేణి భారతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని అప్‌గ్రాడ్ పేర్కొంది. తమ పూర్వ విద్యార్థులు సైతం... అమెజాన్, స్విగ్గీ, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించారని అప్‌గ్రాడ్ తెలిపింది.
ఈ సందర్భంగా అప్‌గ్రాడ్ సహ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ కుమార్ మాట్లాడుతూ... అప్గ్రాడ్ను కొన్ని ఏళ్ల క్రితం ప్రారంభించామని.. ప్రస్తుతం డివిడెండ్లు పొందే స్థాయికి ఎదిగామన్నారు. లెర్నింగ్ ప్రయాణంలో జీవితకాలం మమ్మల్ని విశ్వసించేలా 10వేలకు పైగా అభ్యాసకులకు సౌకర్యవంతంగా ప్రోగ్రామ్ అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. MICA అహ్మదాబాద్... ప్రగతిశీల నాయకత్వం లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదన్నారు. వారి మద్దతుతోపాటు అప్గ్రాడ్పై విశ్వాసం చరిత్ర సృష్టించడానికి దారితీస్తుందని మయాంక్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
MICA ప్రెసిడెంట్, డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర రాజ్ మెహతా మాట్లాడుతూ... ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యం కలిగిన టాలెంట్ పూల్‌ను ఎంపిక చేసుకోవడానికి సహాయపడిన అప్‌గ్రాడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నేళ్ల భాగస్వామ్యంలో అభ్యాసకులకు కెరీర్ పరంగా ఉత్తమ ఫలితాలను అందించామన్నారు. రాబోయే పారిశ్రామిక సవాళ్లను పరిష్కరించడానికి తదుపరి తరం నాయకులుగా నైపుణ్యం కలిగిన మార్కెటింగ్ నిపుణులను తయారు చేస్తామని ఆయన అన్నారు.
మరోపక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) ఫౌండేషన్, స్టార్ట్-అప్ Aspire ఫర్ హర్‌తో కలిసి విద్యార్థులకు Google కెరీర్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ కోర్సును ఎవరైనా, ఎప్పుడైనా అభ్యసించవచ్చు. ఈ కోర్సులు అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలలో ఉద్యోగాల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించినవి అని ఏఐసీటీఈ తెలిపింది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ Aspire for Her ద్వారా ఆన్లైన్లో ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22న సాయంత్రం 4 గంటలకు విద్యార్థులకు ఓరియంటేషన్ సెషన్ నిర్వహించనున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.