Telangana Jobs: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 499 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

MHSRB Telangana Recruitment 2020 | తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్-TIMS కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

news18-telugu
Updated: June 16, 2020, 3:03 PM IST
Telangana Jobs: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 499 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Telangana Jobs: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 499 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్-TIMS లో ఖాళీల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-MHSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 499 ఖాళీలను భర్తీ చేయబోతోంది. నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి ఏడాది కాలం పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 16న అంటే ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

MHSRB Telangana Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 499
ప్రొఫెసర్- 14
అసోసియేట్ ప్రొఫెసర్- 24
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 48
సివిల్ అసిస్టెంట్ సర్జన్- 129

నర్సింగ్ సూపరింటెండెంట్- 1
అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్- 20
స్టాఫ్ నర్స్- 246
డైటీషియన్- 1
బయో మెడికల్ ఇంజనీర్- 1
ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ- 2
ఫార్మాసిస్ట్- 12
మెడికల్ రికార్డ్ ఆఫీసర్- 1

MHSRB Telangana Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 19 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Powergrid Jobs: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ నోటిఫికేషన్

IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్

Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 16, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading