హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ మినహాయింపులు... కండిషన్స్ అప్లై...

స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ మినహాయింపులు... కండిషన్స్ అప్లై...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రాష్ట్రాల బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కోసం కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన రాష్ట్రాల బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కోసం కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ మినహాయింపులు ఇస్తున్నట్టు అజయ్ భల్లా తెలిపారు. అయితే, కొన్ని కండిషన్లు కూడా విధించారు. కింద పేర్కొన్న కండిషన్లను అమలు పరుస్తూ పరీక్షలను నిర్వహించవచ్చు.

1. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు

2. టీచర్లు, పరీక్షల సిబ్బంది, విద్యార్థులు అందరూ ఫేస్ మాస్క్ వేసుకోవడం తప్పనిసరి

3. అన్ని పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి.

4. చాలా బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటిస్తున్నందున వాటిపై విద్యార్థులకు సంశయం లేకుండా చూడాలి.

5. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను వినియోగించవచ్చు.

First published:

Tags: 10th Class Exams, Exams, Intermediate exams, Union Home Ministry

ఉత్తమ కథలు