గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (Gujarat Metro Rail Corporation) కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, JE, డిప్యూటీ జనరల్ మేనేజర్ (Dept. General Manger), మెయింటెనర్ మరియు ఇతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13 న ప్రారంభమైంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ (Online) దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ నవంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం (Salary) చెల్లిస్తారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ (Notification), దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ www.gujaratmetrorail.com లో GMRC యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
పోస్టుల సమాచారం..
పోస్టుపేరు | ఖాళీలు | దరఖాస్తుకు గరిష్ట వయసు |
అసిస్టెంట్ మేనేజర్ (రోలింగ్ స్టాక్) | 01 | 32 సంవత్సరాలు |
అసిస్టెంట్ మేనేజర్ (సిగ్నలింగ్) | 02 | 32 సంవత్సరాలు |
అసిస్టెంట్ మేనేజర్ (L&E) | 03 | 32 సంవత్సరాలు |
జాయింట్ జనరల్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M) | 01 | 50 సంవత్సరాలు |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 01 | 45 సంవత్సరాలు |
మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 02 | 40 సంవత్సరాలు |
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M) | 04 | 32 సంవత్సరాలు |
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 03 | 30 సంవత్సరాలు |
సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 02 | 30 సంవత్సరాలు |
అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 04 | 28 సంవత్సరాలు |
జూనియర్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) | 04 | 28 సంవత్సరాలు |
నిర్వహణ (సివిల్/ట్రాక్ (O&M)) | 04 | 28 సంవత్సరాలు |
IIT Recruitment 2021 : ఐఐటీ మండీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం వివరాలు
దరఖాస్తు చేసుకోనే అభ్యర్థి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (Graduation), ఇంజనీరింగ్ (Engineering) డిగ్రీ చేసి ఉండాలి. అంతే కాకుండా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకొనే వారు తమ గత సంస్థ పేస్లిప్‌లను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
Step 1 : ఆన్‌లైన్ (Online) దరఖాస్తులను సంస్థ పరిశీలిస్తుంది.
Step 2 : వాటని పరిశీలించి అభ్యర్థును ఎంపిక చేస్తారు.
Step 3 : అభ్యర్థులు సబ్‌మిట్ చేసి దరఖాస్తులో తప్పుడు సమాచారం ఉంటే ఏ క్షణమైన ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతి (Online System)లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.gujaratmetrorail.com ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ (Notification)ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : అనంతరం అప్లికేషన్ లింక్ https://www.gujaratmetrorail.com/apply-online/ ను క్లిక్ చేయాలి.
Step 5 : ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫాంను పూర్తిగా నింపాలి.
Step 6 : అనంతరం ఫాంను సబ్‌మిట్ చేయాలి.
Step 7 : ఫాం సబ్‌మిట్ చేసిన తరువాత అప్లికేషన్ (Application) ను ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని దాచుకోవాలి.
Step 8 : ఈ పోస్టుల దరఖాస్తుకు నవంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS