మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mes.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 502
సూపర్‌వైజర్- 450
డ్రాఫ్ట్‌మ్యాన్- 52
Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాల భర్తీకి విజయవాడలో ఇంటర్వ్యూలు... యువతులకు మాత్రమే
GMH Tirupati Recruitment 2021: తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 12
రాతపరీక్ష- 2021 మే 16
విద్యార్హతలు- డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ పాస్ కావాలి. సూపర్‌వైజర్ పోస్టుకు ఎకనమిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, వేర్‌హౌజింగ్ మేనేజ్‌మెంట్, పర్‌చేసింగ్, లాజిస్టిక్స్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించొచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలా? ఈ 10 ఐడియాలు మీకోసమే
BDL Recruitment 2021: హైదరాబాద్, విశాఖపట్నంలోని బీడీఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Govt Jobs 2021, Indian Military, Job notification, JOBS, NOTIFICATION