‘పది’ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెబ్‌సైట్‌లో మెమోలు..

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఏ బాదరాబందీ లేకుండా పోయింది. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: June 14, 2020, 5:31 PM IST
‘పది’ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెబ్‌సైట్‌లో మెమోలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్.. కొంతమంది పదో తరగతి విద్యార్థులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పిందనే భావించాలి. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి చాలా కీలకమైంది. పదో తరగతిలో పాసయ్యేందుకు.. మంచి మార్కులు సాధించేందుకు ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలదైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ పాఠశాల విద్యార్థులంతా 10 పాయింట్లకు పది సాధించాలని ఉద్దేశంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల నుంచే విద్యార్థులను రుద్దడం మొదలుపెడతారు. ఇక వార్షిక పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయంలో వారి బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. అయితే అలాంటి వారందరికీ కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఏ బాదరాబందీ లేకుండా పోయింది.

ఇంటిలో కూర్చొనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అందరూ పాస్‌ కావడంతో 15వ తేదీ నుంచి షార్ట్‌ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు కసరత్తు చేస్తోంది. త్వరలోనే అన్ని స్కూళ్లకు ఒరిజినల్‌ మార్కుల జాబితాను కూడా పంపేందుకు సిద్ధమవుతున్నది.

పరీక్షలు రాయకుండానే విద్యార్థులంతా పాసవ్వడంతో ఈసారి రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ అంశాలు ఉత్పన్నం కావడం లేదు. కేవలం ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నందున సమస్యలు ఉండబోవని అధికారులు అంటున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల అవసరం కూడా లేకుండా పోయింది.
Published by: Narsimha Badhini
First published: June 14, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading