Jobs: కేంద్ర ఐటీ శాఖలో జాబ్స్... రూ.60,000 జీతం

MeitY recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-MeitY జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 24, 2020, 3:10 PM IST
Jobs: కేంద్ర ఐటీ శాఖలో జాబ్స్... రూ.60,000 జీతం
Jobs: కేంద్ర ఐటీ శాఖలో జాబ్స్... రూ.60,000 జీతం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-MeitY యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 ఖాళీలున్నాయి. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల లోపు కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. నెలకు రూ.60,000 స్టైపెండ్ లభిస్తుంది. పలు అంశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ లింక్ నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. https://www.meity.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని చివరి తేదీ లోగా negdadmin@digitalindia.gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.

Indian Navy Jobs 2020: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Railway Jobs: రైల్వే సంస్థలో 1000 జాబ్స్... దరఖాస్తుకు మూడు రోజులే గడువు

MeitY recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు మొత్తం- 25
దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 30వయస్సు- 2020 సెప్టెంబర్ 15 నాటికి 32 ఏళ్లు
విద్యార్హత- ఏదైనా సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా 2 ఏళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా ఎల్ఎల్‌బీ లేదా సీఐ లేదా ఐసీడబ్ల్యూఏ. ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అదనపు విద్యార్హతలు, రీసెర్చ్ అనుభవం, పబ్లిష్డ్ పేపర్స్ లాంటివి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
స్టైపెండ్- నెలకు రూ.60,000
విధులు- అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రీషియన్, రూరల్ డెవలప్‌మెంట్, వుమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్, సోషల్ వెల్‌ఫేర్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్‌మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, లాజిస్టిక్స్, డేటా మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, స్టార్టప్, ఫైనాన్షియల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాస్సెసింగ్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ లాంటి ఐటీ ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: September 24, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading