Home /News /jobs /

MEGHNATH DESAI ACADEMY MERIT SCHOLARSHIP OFFER OPPORTUNITY FOR ECONOMICS DATA SCIENCE FINANCE STUDENTS DETAILS HERE GH VB

MDAE: మేఘనాథ్ దేశాయ్ అకాడమీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ఆఫర్.. ఆ విద్యార్థులకు చక్కటి అవకాశం..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ముంబై కేంద్రంగా పనిచేసే మేఘనాథ్ దేశాయ్ అకాడమీ ఆఫ్ ఎకనామిక్స్ (MDAE) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌లో మెరిట్ స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

ముంబై కేంద్రంగా పనిచేసే మేఘనాథ్ దేశాయ్ అకాడమీ ఆఫ్ ఎకనామిక్స్ (MDAE) పోస్ట్ గ్రాడ్యుయేట్(Post Graduates) విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌లో మెరిట్ స్కాలర్‌షిప్‌లు(Scholarships) ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్‌లో(PG Diploma in Economics) 12 స్కాలర్‌షిప్‌లు, డేటా సైన్స్(Data Science) నుంచి అదనంగా మరో 4 స్కాలర్‌షిప్‌లను 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ meghnaddesaiacademy.org నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లలో దాదాపు 90 శాతం వరకు మెరిట్ విద్యార్థుల కోసం కేటాయించినట్లు మేఘనాద్ దేశాయ్ అకాడమీ(Academy) తెలిపింది. ముందు ప్రవేశ పరీక్ష(Entrance Test), అడ్మిషన్ల ఇంటర్వ్యూ(Interview) ఉంటుంది. ఇది పూర్తి చేసిన అభ్యర్థులు మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందవచ్చు. ఫైనల్‌గా స్కాలర్‌షిప్‌ల మంజూరు‌కు ఇంటర్వ్యూ ఉంటుందని సంస్థ వెల్లడించింది.

TSPSC Group-1 Applications: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

మేఘనాథ్ దేశాయ్ అకాడమీ ఆఫ్ ఎకనామిక్స్ అకడమిక్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్.. ప్రొఫెసర్ అమలేష్ కనేకర్ మాట్లాడుతూ... “పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్కాలర్‌షిప్‌లు మెరిట్ విద్యార్థులు వారి అకడిమిక్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయి.’’ అని కనేకర్ అభిప్రాయపడ్డారు.

మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ కాకుండా MDAE అకడమిక్ బర్సరీని అందిస్తుంది. అభ్యర్థి ప్రొఫైల్, మెరిట్ ఆధారంగా మొత్తం రుసుము నుండి తీసివేసిన నిర్ణీత మొత్తాన్ని అకడమిక్ బర్సరీ అంటారు. బర్సరీని MDAE బోర్డు సభ్యుడు స్పాన్సర్ చేయవచ్చు. 2021-2022 విద్యా సంవత్సరానికి, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులలో మూడింట ఒక వంతు మందికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను అందజేసినట్లు MDAE తెలిపింది.

Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

మరోవైపు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) చెందిన ప్రతిభావంతులైన BTech విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలలో భాగంగా స్కాలర్‌షిప్ ఫండ్‌ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.10.5 కోట్లను కేటాయించనుంది. ఈ ఫండ్ ఐఐటీ మద్రాస్‌లోని అర్హులైన విద్యార్థుల ట్యూషన్ ఫీజులను మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్‌లను కవర్ చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ప్రతిభావంతమైన విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (PMS) మంజూరు చేస్తోంది. ఇందు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ వెబ్ సైట్ ఇ- పాస్ పోర్టల్ ద్వారా విద్యార్థులు నమోదు చేసుకోవాలి. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఇ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 24లోపు అప్‌లోడ్ చేయాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Data science, Economics, Scholarship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు