Home /News /jobs /

MEGA SKILL AND JOB DRIVE IN AP FOR JOB VACANCIES AT KIA MOTORS AMAZON AMARARAJA JIO AIRTEL AND OTHER 13 COMPANIES HERE DETAILS NS

Mega Job Drive in AP: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా.. KIA Motors, Amazon, Amararaja, Jio, Airtel తదితర సంస్థల్లో ఉద్యోగాలు.. రూ. 18 వేల వరకు వేతనం

ఏపీలో రేపు మెగా జాబ్ మేళా.. KIA, Amazon, Amararaja, Jio, Airtel తదితర సంస్థల్లో ఉద్యోగాలు

ఏపీలో రేపు మెగా జాబ్ మేళా.. KIA, Amazon, Amararaja, Jio, Airtel తదితర సంస్థల్లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో రేపు మరో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు APSSDC ఏర్పాట్లు చేసింది. ఈ జాబ్ మేళాలో KIA Motors, Amazon, Amararaja, Jio, Airtelతో పాటు మొత్తం 13 కంపెనీలు పాల్గొననున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల వరుసగా జాబ్ మేళా (Job Mela) లకు సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా APSSDC మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ కియా మోటార్స్ (KIA Motors) , అమెజాన్ (Amazon), జియో మార్ట్ (Jio Mart), ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అమరరాజా బ్యాటరీస్ తో కలిపి మొత్తం 13 సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

    విద్యార్హతల వివరాలు:
    KIA Motors: ఈ సంస్థలో ట్రైనీ టెక్నీషియన్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల వేతనంతో పాటు బస్ సౌకర్యాం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలో పని చేయాల్సిఉంటుంది.
    Amazon: ఈ సంస్థలో Pickers/Packers/Data Entry Executives విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు/ఏపీలో పని చేయాల్సి ఉంటుంది.
    AP Tenth Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

    Amararaja Batteries: ఈ సంస్థలో టెక్నీషియన్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కంపెనీ నిబంధనల ఆధారంగా వేతనం ఉంటుంది. ఇంకా ఎంపికైన వారు చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది.
    JIO Mart: ఈ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇంకా ఎంపికైన వారు కడప, కర్నూలులో పని చేయాల్సి ఉంటుంది.
    Airtel Payments Bank: ఈ సంస్థలో ప్రమోటర్స్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నాను. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16,275 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఇంకా ఎంపికైన అభ్యర్థులు కడప, కర్నూలు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
    BOI Recruitment 2021: డిగ్రీ చేసిన వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు SV Arts, Commerce&Science Degree College, Chagalamaari, Allagadda Conistituency - Karnool District చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఈ నెల 7న ఉదయం 10 గంటలలోగా హాజరు కావాల్సి ఉంటుంది.



    -అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రస్, Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో సూచించారు.
    -ఇంకా ఇతర పూర్తి వివరాలకు 8885904099, 9701303790 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, Private Jobs, Reliance JioMart

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు