Haribabu, News18, Rajanna Sircilla
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) వ్యాప్తంగా నిరుద్యోగులకు, చదువుకున్న యువతకు అద్భుత అవకాశం ఇది. 10 వేల ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా (Mega job Mela) నిర్వహించనున్నారు. వేములవాడలోని ఆధ్య గోలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రముఖ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేలు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. ఈ జాబ్ మేళాలో 150కి పైగా ప్రైవేటు సంస్థలు పలు ఉద్యోగాల నియామకం కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 12న వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ బేళా ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ ఉద్యోగ జాతర నిర్వహిస్తున్నట్లు డాక్టర్ గోలి మోహన్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు:- ఫైనాన్స్, ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, టెలీకాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 150కి పైగా ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సంస్థ ప్రతినిధులతో పాటు సీఈవోలు కూడా జాబ్ మేళాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
రూ.11వేల నుంచి రూ.40వేల వరకు వేతనాలు:
డా.మోహన్ నిర్వహించే ఈ జాబ్ మేళాకు పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇంటర్, 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీయువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. విద్యార్హతలు బట్టి ఉద్యోగ నియామకాలు జరుగుతుండగా రూ. 11 వేలు నుంచి రూ. 40 వేలు జీతం లభించే ఉద్యోగాలు ఉన్నాయి.
వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన డాక్టర్ గోలి మోహన్ 19 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి తనతో పాటు మరో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. సొంత ఊరిపై మకారంతో ఆధ్య ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోలి మోహన్..జిల్లాలోని యువతకు అవకాశాలు కల్పించేలా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందుకోసం వివిధ కంపెనీల సీఈవోలతో తానే స్వయంగా మాట్లాడినట్లు తెలిపాడు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, Karimnagar, Local News, Telangana, Vemulawada