హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. లక్ష వరకు వేతనంతో 9 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

Telangana Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. లక్ష వరకు వేతనంతో 9 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 25న మరో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kodad

ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఈ రోజుల్లో జోరుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాబ్ మేళాలను (Job Mela) భారీగా నిర్వహిస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువకులకు వేలాదిగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తాజాగా కోదాడలో భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ నెల 25న ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏఏ విభాగాల్లో అంటే:

ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, మెడికల్, మార్కెంటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, ఇండస్ట్రీలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

TS Govt Jobs: 1400 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్ రావు .. ఖాళీల వివరాలివే!

విద్యార్హతలు:

7, 10, ఇంటర్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మూగ, చెవిటి, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు.

వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది.

రిజిస్ట్రేషన్-LINK

ఇంటర్వ్యూ నిర్వహించే వేధిక: పెరిక భవన్, కోదాడ.

తేదీ: ఫిబ్రవరి 25, ఉదయం 10 గంటలకు

హెల్ప్ లైన్ నంబర్లు: 9346848034, 9010140584.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు