ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల జాబ్ మేళాలకు (Job Mela) సంబంధించి వరుస ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26.. ఉదయం 9 గంటలకు వినుకొండలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు:
Daikin: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిప్లొమా ట్రైనీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.99 లక్షల వేతనం ఉంటుంది. డిప్లొమా అభ్యర్థలు అప్లై చేసుకోవచ్చు.
Hetero Drugs: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీకాం, బీఎస్సీ, బీఏ అభ్యర్థులు తో పాటు ఐటీఐ, డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2.4 లక్షల నుంచి రూ.2.9 లక్షల వరకు వేతనం ఉంటుంది.
Joy Alukkas: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది.
SBI Life Insurance: ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నరసరావుపేట, గుంటూరు , పిడుగురాళ్లలో పని చేయాల్సి ఉంటుంది.
- వీటితో పాటు మరో 9 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈ రోజు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
Bank Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
@AP_Skill has Conducting Job Mela at 1st Ward Girls High School, Lawyers Street #Vinukonda #PalnaduDistrict
Registration Linkhttps://t.co/jaCOqrAzps Contact P. Srikanth 9492158153 D. Jani Basha 9951214919 APSSDC Helpline – 9988853335 pic.twitter.com/hHHWPCHwpe — AP Skill Development (@AP_Skill) May 23, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 9 గంటలకు 1st Ward Girls High School, Lawyers Street, Vinukonda, Vinukonda Constituncy, Palnadu District నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs