హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Mega Job Mela in AP: ఏపీలో ఎల్లుండి మెగా జాబ్ మేళా.. కియా మోటార్స్ తో పాటు 15 సంస్థల్లో జాబ్స్.. రూ.35 వేల వరకు వేతనం

Mega Job Mela in AP: ఏపీలో ఎల్లుండి మెగా జాబ్ మేళా.. కియా మోటార్స్ తో పాటు 15 సంస్థల్లో జాబ్స్.. రూ.35 వేల వరకు వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 2న మరో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Ongole | Hyderabad

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ కియా మోటార్స్ (KIA Motors), టాటా ప్లే, అరబిందో, బైజూస్, అపోలో, డీమార్ట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాలని సూచించారు అధికారులు. ఈ ఇంటర్వ్యూలను ఒంగోలులో (Ongole) సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు భారీ వేతనం చెల్లించనున్నారు.ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
  TATA PLAY, Kia Motors, Aurobindo, Byju’S, Apollo Pharmacy, Amazon Pay, Dmart తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మొత్తం 15 కంపెనీల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏపీలో ఎక్కడైనా లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
  Jobs In AOC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ Ordnance Corpsలో 3068 పోస్టులకు నోటిఫికేషన్..  ఇతర వివరాలు:
  - అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
  -రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు TTDC Office (Velugu Office) Bhagya Nagar, 4th Line, 11th Cross Road, Ongole చిరునామాలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
  -ఇతర పూర్తి వివరాలకు 9988853335 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, KIA Motors, Private Jobs

  ఉత్తమ కథలు